రాములమ్మకు కోపమొచ్చింది.. హరహర మహాదేవ, జై శ్రీరామ్
X
ఫైర్‌బ్రాండ్ నాయకురాలు విజయశాంతికి కోపమొచ్చింది. తను బీజేపీని విడిచివెళ్లడం లేదని పదేపదే వివరణ ఇస్తున్నా పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్ర్రచారంపై ఆమె మండిపడ్డాడు. సొంతపార్టీకే చెందిన కొందరు తనను లక్ష్యంగా చేసుకుని దుష్ర్పచారం చేస్తున్నారని ట్వీట్ చేశారు.
‘చిట్‌చాట్‌ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ నాకు అలవాటు లేదు. పార్టీ కి ఏది ముఖ్యమో ఆ అంశాలను పార్టీ ప్రధాన నాయకులకు ఈ నెల 16 న ముఖ్య సమావేశంలో నేను స్పష్టంగా తెలియజేశాను. ఆ విషయాలు బయటకు లీకేజ్‌ల పేరుతో ఇవ్వడానికి నేను వ్యతిరేకిని. ఇదంతా తెలిసి కూడా కొంతమంది మా పార్టీలోని నేతలు పనిగట్టుకుని బీజేపీకి రాములమ్మ దూరం అంటూ నాపై సోషల్ మీడియా ద్వారా చేయిస్తున్న ప్రచారం తప్పక ఖండంచదగ్గది... జై శ్రీరామ్ హర హర మహాదేవ జై తెలంగాణ...’’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన కాంగ్రెస్ సీడబ్లూసీకి సమావేశాలకు సోనియా గాంధీ వచ్చినప్పుడు...పార్టీలకు అతీతంగా ఆమె గౌరవిస్తామని విజయశాంతి ట్వీట్ చేశారు. దీంతో ఆమె బీజేపీని వదిలి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరతారని ప్రచారం జరుగుతోంది.