స్పీకర్పై అవిశ్వాస తీర్మానం.. అసెంబ్లీ నుండి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెండ్
X
బుధవారం (జులై 19) జరిగిన కర్నాటన అసెంబ్లీ సమావేశం రసాభాసగా మారింది. స్పీకర్ యు.టి. ఖాదర్ తీరును నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు బైఠాయించారు. తర్వాత స్పీకర్ పైకి కాగితాలు విసిరి నిరసన తెలిపారు. దాంతో ఆగ్రహించిన సభాపతి బీజేపీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. దాంతో స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కర్నాటక ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల పదవిని దుర్వినియోగం చేయడం, మధ్యాహ్న భోజన విరామం లేకుండా ప్రొసీడింగ్స్ నిర్వహించడాన్ని వ్యతిరేకించిన బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
దీంతో అసెంబ్లీ సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. మంగళవారం (జులై 18) ముగిసిన ప్రతిపక్షాల పార్టీల ఐక్యతా సమావేశానికి సంబంధించి.. ఐఏఎస్ అధికారుల బృందాన్ని నియమించారు. దీన్ని బీజేపీ నేతలు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో లా అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్ కె పాటిల్ బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెంచే చేశారు. జులై 3న ప్రారంభమయిన కర్నాటక అసెంబ్లీ సమావేశాలు జులై 21న ముగుస్తాయి.