మోదీది కులం తక్కువని రాహుల్ అలా..
X
మణిపూర్ ఘటనను నిరసిస్తూ ఎన్డీఏపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ నడుస్తోంది. మూడురోజుల పాటు ఈ చర్చ జరగనుంది. అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ చర్చను ప్రారంభించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే అవిశ్వాసం తీసుకొచ్చామని.. మణిపూర్‌కు న్యాయం కోసమే ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కాంగ్రెస్పై విరుచుకపడ్డారు.
మోదీ ఇంటి పేరు విషయంలో రాహుల్ క్షమాపణలు చెప్పకపోవడంపై ఆయన విమర్శలు గుప్పించారు. మోదీది తక్కువ కుల అని.. అందుకే రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పడంలేదని ఆరోపించారు. క్షమాపణలు చెప్పడానికి తాను సావర్కర్ కాను అని రాహుల్ చేసిన కామెంట్స్ పై దూబే స్పందించారు. రాహుల్ ఎప్పటికీ సావర్కర్ కాలేరన్నారు. సావర్కర్ 28ఏళ్లు జైల్లో ఉన్నారని గుర్తుచేశారు. రాహుల్ కు సుప్రీంకు క్లీన్ చిట్ ఇవ్వలేదని.. కేవలం తీర్పుపై స్టే మాత్రమే ఇచ్చిందని అన్నారు.
రాహుల్ గాంధీ చర్చను ప్రారంభించకపోవడంపై దూబే సెటైర్స్ వేశారు. రాహుల్ ఆలస్యంగా నిద్రలేవడం వల్లే చర్చను ప్రారంభించలేదేమోనని ఎద్దేవా చేశారు. ఇక మణిపూర్ అల్లర్ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్కు లేదని విమర్శించారు. గతంలో డ్రగ్ మాఫియాను ప్రోత్సహించింద కాంగ్రెస్సేనని ఆరోపించారు. కౌరవులకు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని అన్నారు.
bjp mp,nishikant dubey,rahul gandhi,pm modi,lok sabha,parliament,amit shah