Rahul Kaswan : బీజేపీకీ బిగ్ షాక్..కాంగ్రెస్‌లోకి చేరిన మరో ఎంపీ
X
లోక్ సభ ఎన్నికల వేళ పలు చోట్ల రాజకీయ పార్టీల నేతల వలసలు కొనసాగుతున్నాయి.తాజాగా రాజస్థాన్‌లో బీజేపీకి షాక్ తగిలింది. చురు లోక్ సభ స్థానం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన రాహుల్ కస్వాన్ బీజేపీకి రాజీనామా చేశారు. తన ఎంపీ పదవికి రిజైన్ చేసి. వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. బీజేపీ టికెట్ నిరాకరిండంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది.చురు లోక్ సభ నుంచి ఈ సారి బీజేపీ తరఫున జావెలిన్ త్రో క్రీడాకారుడు దేవేంద్ర బరిలోకి దిగుతారు.
దేవేంద్ర కూడా స్థానికుడు కావడంతో బీజేపీ టికెట్ ఇచ్చింది. పారా ఒలింపిక్స్‌లో రెండు సార్లు గోల్డ్, ఒకసారి సిల్వర్ మెడల్‌ను దేవేంద్ర సాధించారు. రాహుల్ కాశ్వాన్ పార్టీ వీడుతున్నట్టు ప్రకటన చేశారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరతారు. టికెట్ గురించి హామీ వచ్చినందునే హస్తం పార్టీలో చేరుతున్నారని తెలిసింది. ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొనే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ సమక్షంలో కాశ్వాన్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ 39 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించింది. సెకండ్ లిస్ట్ ఈ రోజు సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉంది. అందులో కాశ్వాన్ పేరు ఉండే అవకాశం ఉంది.