Home > జాతీయం > BJP : నేటి నుంచి రెండు రోజులు.. బీజేపీ జాతీయ మండలి సమావేశాలు

BJP : నేటి నుంచి రెండు రోజులు.. బీజేపీ జాతీయ మండలి సమావేశాలు

BJP : నేటి నుంచి రెండు రోజులు.. బీజేపీ జాతీయ మండలి సమావేశాలు
X

ఢిల్లీలో నేటి నుంచి భారతీయ జనతా పార్టీ జాతీయ మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండు రోజులపాటు జరగనున్న ఈ సమావేశాలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ ముఖ్య అతిధిగా హాజరవుతారు. లోక్ సభ ఎన్నికలకు బీజేపీ ఎజెండాను ఈ సమావేశాల్లో మోదీ ఆవిష్కరించే అవకాశముంది. కాగా ఈ సమావేశలకు 11,500 మంది బీజేపీ సభ్యులు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి 260 మంది, ఏపీ నుంచి 210 మంది ప్రతినిధులు హాజరవుతారు. ఈ సమావేశాల్లో బీజేపీ జాతీయ కార్యవర్గంతో పాటు అన్ని రాష్ట్రాల పార్టీ కార్యవర్గం సభ్యులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.

రానున్న లోకసభ ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ నిర్దేశించుకున్న 370 స్థానాల్లో విజయం సాధించడంతో పాటు 400 స్థానాలకు పైగా ఎన్డీయే కూటమి గెలుస్తుందనే పలు సర్వేలు ఇప్పటికే వెల్లడించాయి. ఇక, బీజేపీ విధానాలు, దేశహితం, సాధించిన దేశ పురోగతి, దేశ సమగ్రాభివృద్ధి, ముందున్న సవాళ్ళు, లక్ష్యాలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చించనున్నారు. రాజకీయ, సామాజిక, ఆర్ధిక, అంతర్జాతీయ సత్సంబంధాలు లాంటి అంశాలపై విస్తృతంగా చర్చించి తీర్మానాల ద్వారా ఆమోదం తెలిపనున్నారు. 10 ఏళ్ళు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు అమలు చేసిన పలు పథకాలు.. తీసుకున్న పలు కీలక నిర్ణయాలతో భారత దేశం సాధించిన ప్రగతితో ఆవిష్కృతమైన “వికసిత్ భారత్”కు హాజరైన ప్రతినిధులకు వివరించనున్నారు.




Updated : 17 Feb 2024 5:01 AM GMT
Tags:    
Next Story
Share it
Top