Sanatan opponents:రామమందిర ఆహ్వానాన్ని తిరస్కరించారని.. బీజేపీ పోస్టర్ వార్
X
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకల ఆహ్వానాన్ని పలువురు ప్రతిపక్ష నేతలు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎవరైతే ఆహ్వానాలు తిరస్కరించారో వారిని టార్గెట్ చేస్తూ పోస్టర్ వార్‌కి దిగింది. ఆ పార్టీలు హిందూ వ్యతిరేకులని బీజేపీ ఆరోపించింది. జనవరి 22న అయోధ్య రామమందిరంలో జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా వేడుక ఆహ్వానాన్ని తిరస్కరించిన నేతలను సనాతన ధర్మ వ్యతిరేకులుగా అభివర్ణించింది. ఈమేరకు ఘాటు విమర్శలతో ట్విట్టర్ (ఎక్స్)లో ఒక పోస్టర్‌ను పోస్ట్ చేసింది. ‘‘రామ మందిర ప్రాణ్ ప్రతిష్ఠా వేడుకకు ఆహ్వానాన్ని తిరస్కరించిన సనాతన ప్రత్యర్థుల ముఖాలను గమనించండి’’ అంటూ తన ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసింది.
ఈ పోస్టర్‌లో కాంగ్రెస్ నేతలతో పాటు వామపక్షాల నాయకులు, ఎస్పీ నేతలు ఇందులో ఉన్నారు. మమతా బెనర్జీ, సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, సీతారం ఏచూరి, అఖిలేష్ యాదవ్, అధిర్ రంజన్ చౌదరి ఫోటోలతో కూడిన పోస్టర్లను బీజేపీ రిలీజ్ చేసింది. తాము వేడుకలు హాజరుకావడం లేదని నిన్న కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. రామాలయ ప్రారంభోత్సవ వేడకు బీజేపీ/ఆర్ఎస్ఎస్ ఈవెంట్‌లా ఉందని విమర్శించింది.
पहचानिए, राम मंदिर प्राण प्रतिष्ठा समारोह के न्योते को ठुकराने वाले सनातन विरोधियों के चेहरे... pic.twitter.com/0ESH0eYUt1
— BJP (@BJP4India) January 11, 2024