ఈ నెల 25న తెలంగాణలో జేపీ నడ్డా పర్యటన
X
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారు. ఈ నెల 25న ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారు. నాగకర్నూల్‌లో జరిగి భారీ బహిరంగ సభకు నడ్డా హాజరవుతారని తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ తెలిపారు. ఇటీవల రద్దైన అమిత్ షా పర్యటన కూడా ఖరారు కానుందని వెల్లడించారు. వాయిదా పడిన పర్యటనను ఖమ్మంలోనే కొనసాగించాలని నిర్ణయించినట్టు వివరించారు. నేతలంతా సమష్టిగా కలిసి ఎన్నికల సమరంగంలో పాల్గొంటారని స్పష్టం చేశారు. బీజేపీపై సోషల్ మీడియాలో వైరల్ చేసే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కోరారు.రాష్ట్ర నాయకత్వంతో పార్టీ సమష్టిగానే పనిచేస్తోందని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందన్న ఆరోపణలను తరుణ్ చుగ్ కొట్టిపారేశారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు బీ టీమ్‌గా కాంగ్రెస్ పనిచేస్తోందని ఆరోపించారు. బిహార్ సీఎం నీతీశ్ నేతృత్వంలో విపక్షాల భేటీకి కాంగ్రెస్‌తో పాటు కేసీఆర్ కూడా హాజరవుతున్నారని.. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.