Home > జాతీయం > Kishan Reddy: హైదరాబాద్‌తో సహ తెలంగాణలో అన్ని చోట్లా గెలుస్తాం.. బీజేపీ చీఫ్

Kishan Reddy: హైదరాబాద్‌తో సహ తెలంగాణలో అన్ని చోట్లా గెలుస్తాం.. బీజేపీ చీఫ్

Kishan Reddy: హైదరాబాద్‌తో సహ తెలంగాణలో అన్ని చోట్లా గెలుస్తాం.. బీజేపీ చీఫ్
X

తెలంగాణ ప్రజలు మళ్లీ మోదీ పీఎం కావాలని కోరుకుంటారన్నారని, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సమగ్ర కార్యాచరణ కోసం పార్టీ పెద్దలను కలిశామన్నారు. రేపు బీజేపీ ఎన్నికల కమిటీ ఢిల్లీలో సమావేశం కానుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉండనుందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు.. ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారని, బీజేపీ గెలువద్దని కుమ్మక్కు అవుతున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓటేసిన బీఆర్‌ఎస్‌కు ఓటేసిన ఒక్కటేనని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు బీజేపీకి ప్రధాన పార్టీ అని, బీఆర్‌ఎస్‌ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో ఉండదన్నారు. బీఆర్‌ఎస్‌ అరకొర సీటు గెలిచినా, ఓడినా తెలంగాణకు ఒరిగేది పోయేది ఏం లేదని తెలిపారు.

హైదరాబాద్ ఎంఐఎం సీటుతో పాటు తెలంగాణలో అన్ని సీట్లు గెలుస్తామన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ ఎంపీ సీటులో అసదుద్దీన్ ను ఓడిస్తామని వ్యాఖ్యానించారు. సర్వేలు వాస్తవాలు కావని, తెలంగాణలో మెజార్టీ సీట్లు బీజేపీ గెలిచేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌లు డూప్ ఫైటింగ్ చేస్తున్నారని, వంద రోజుల్లో హామీలు ఆమలు, అవినీతి పరులు పై చర్యలు అన్నారని, కానీ ఇంకా సెటిల్ మెంట్లు జరుగుతూనే ఉన్నాయన్నారు.

కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ది లేదన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ సెంటిమెంట్ తో ఆడుకోవద్దని ఆయన సూచించారు. జల వివాదాలపై ప్రజలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ లు మభ్య పెడుతున్నారని, నాగార్జున సాగర్ విషయంలో రెండు ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు. రెండు ప్రభుత్వాలు కలిసి చర్చించుకోవాలన్నారు. ఇక చివరిగా లోక్ సభ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కుట్రలు చేసినా.. మెజారిటీ ఎంపీ స్థానాలు గెలిచేది ముమ్మాటికి బీజేపీయేనని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


Updated : 8 Feb 2024 12:14 PM GMT
Tags:    
Next Story
Share it
Top