ప్రతిపక్షాలను బీజేపీ కావాలనే టార్గెట్ చేస్తుంది..మమతా బెనర్జీ
X
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ పై తీవ్రంగా స్పందించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ తీరుపై ఆమె తీవ్రంగా ఖండించారు. కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ప్రజాస్వామ్యంపై దాడి అని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ట్వీటర్ వేదికగా ఈ ఘటనపై స్పందించారు.
బీజేపీ కావాలనే ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తుందని ఆరోపించారు. ప్రతిపక్షంలోని ముఖ్యమంత్రులను ఉద్దేశ్యపూర్వకంగా లక్ష్యంగా చేసుకొని అరెస్ట్ చేస్తున్నారని, ఇది చాలా దారుణమని విమర్శించారు. అయితే అదే సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సీబీఐ, ఈడీ దర్యాఫ్తు చేస్తున్న నేతలు ఎవరైనా బీజేపీలో ఉంటే మాత్రం వారికి శిక్షపడదన్నారు. ఇతర పార్టీల్లో ఉన్నప్పుడు వెంటబడే ఈడీ..బీజేపీలోకి చేరిన తర్వాత మాత్రం ఎలాంటి శిక్ష ఉండదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్యంపై తీవ్రమైన దాడిగా మమతా బెనర్జీ చెప్పారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.