Home > జాతీయం > Kishan Reddy : ఈ నెల 20 నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర.. లోక్ సభ ఎన్నికలపై ఫోకస్

Kishan Reddy : ఈ నెల 20 నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర.. లోక్ సభ ఎన్నికలపై ఫోకస్

Kishan Reddy   : ఈ నెల 20 నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర.. లోక్ సభ ఎన్నికలపై ఫోకస్
X

పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్ధానాలు కైవసమే లక్ష్యంగా బీజేపీ విజయ సంకల్ప యాత్రను కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు యాత్రలను నిర్వహించనుంది. ఐదు పార్లమెంట్ క్లస్టర్లలో విజయ సంకల్ప యాత్రలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ యాత్రలకు క్లస్టర్ వారీగా బీజేపీ పేర్లు పెట్టింది. భువనగిరి, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు భాగ్యనగరమని నామకరణం చేశారు.

కరీంనగర్, మెదక్ , జహీరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు శాతవాహన అని, అదిలాబాద్, పెద్దపల్లి, నిజమాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కొమురం భీమ్ అని పేరు పెట్టారు. మహబూబ్ నగర్, నాగర కర్నూల్, నల్గొండ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కృష్ణా అని, వరంగల్, మహబూబ్ బాద్, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కాకతీయగా పేర్లు పెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మార్చి మొదటి వారంలో భారీ బహిరంగ సభ పెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించాయి. గత పదేండ్లలో రాష్ట్రానికి మోదీ సర్కార్ కేటాయించిన నిధులు, రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర పథకాలు, గత బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణకు చేసిన అన్యాయం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ గ్యారంటీల పేరుతో ప్రభుత్వాన్ని మోసగిస్తున్న తీరును ఈ రథ యాత్రల్లో రాష్ట్ర నేతలు జనాలకు వివరించనున్నారు. ‘‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’’ నినాదంతో బీజేపీ నేతలు ప్రజల్లోకి వెళ్లనున్నారు. రాష్ట్ర నేతలతో పాటు జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు.




Updated : 11 Feb 2024 8:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top