Home > జాతీయం > పుట్టుకతో అంధుడు..అయితేనేం నేడు ప్రభుత్వ ఉద్యోగి

పుట్టుకతో అంధుడు..అయితేనేం నేడు ప్రభుత్వ ఉద్యోగి

పుట్టుకతో అంధుడు..అయితేనేం నేడు ప్రభుత్వ ఉద్యోగి
X

ఏదైనా సాధించాలనే తపన, పట్టుదల ఉంటే చాలు అంధత్వం కూడా అందుకు అడ్డు రాదని నిరూపిస్తున్నాడు కర్ణాటకకు చెందిన యువకుడు సుమిత్. పుట్టుకతో కళ్లు కనిపించకపోయినా..సంకల్పంతో ఉన్నత విధ్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాడు అంతటితో ఆగలేదు. ఎవరి సహాయం లేకుండా సొంతంగా కంప్యూటర్‎ను ఆపరేట్ చేస్తూ ఆందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. తన ప్రతిభతో ఔరా అని అనిపిస్తున్నాడు. తోటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

బెళగావిలోని గోకక్‌ ప్రాంతానికి చెందిన సుమిత్‌ మోతేకర్‌ పుట్టుకతో అంధుడు. దీంతో చిన్నప్పటి నుంచి సవాళ్లు ఎదురయ్యాయి. అయితే వాటన్నింటినీ పట్టుదలతో అధిగమిస్తూ కష్టపడుతూ ఉన్న విద్యను చదివాడు. చదువలో మంచి మార్కులు రావడమే కాదు ప్రభుత్వ ఉద్యోగాని సాధించాడు సుమిత్. 2021లో బెళగావి మున్సిపల్‌ కార్పొరేషనులోని ఆరోగ్య విభాగంలో సుమిత్‎కు ఉద్యోగం లభించింది. ‘నాన్‌ డెస్క్‌టాప్‌ విజువల్‌ ఎక్సెల్‌’ అనే యాప్‎ను ఉపయోగించి సుమిత్ ఎవరి సాయం తీసుకోకుండా సొంతంగా కంప్యూటర్‌ను ఆపరేట్‌ చేస్తున్నాడు. అంతే కాదు తన పై అధికారులు ఫోను చేస్తే.. ‘టాక్‌ బ్యాక్‌’ యాప్‌ సహాయంతో ఎవరు ఫోను చేస్తున్నారో తెలుసుకొని తదనుగుణంగా స్పందిస్తున్నాడు. కీడా రంగంలోనూ తన టాలెంట్ చూపించాడు సుమిత్. కర్ణాటక తరఫున నేషనల్ లెవెల్ అంధుల కుస్తీ పోటీల్లో పాల్గొన్నాడు, లక్షద్వీప్‌లో జరిగిన ఫుట్‌బాల్‌ టోర్నీల్లోనూ రెండుసార్లు భాగమయ్యాడు. సాహిత్యం మీద ఇష్టంతో పలు వ్యాసాలు, కథలు కూడా రాశాడు. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగిగా తన విధులను నిర్వర్తిస్తూనే సుమిత్‌ మిగతా రంగాల్లో తన ప్రతిభను చూపిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. పుట్టుకుతో అంధుడైన సుమిత్ ఇలాంటి అద్భుతాలు సాధిస్తుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.




Updated : 10 July 2023 10:07 AM IST
Tags:    
Next Story
Share it
Top