Home > జాతీయం > Gautam Adani : రూ.12 లక్షల కోట్లకు పెరిగిన అదానీ గ్రూప్ ఆదాయం

Gautam Adani : రూ.12 లక్షల కోట్లకు పెరిగిన అదానీ గ్రూప్ ఆదాయం

Gautam Adani : రూ.12 లక్షల కోట్లకు పెరిగిన అదానీ గ్రూప్ ఆదాయం
X

ఇటీవల వెలువడిన మూడు రాష్ట్రాల ఫలితాల్లో బీజేపీ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ప్రముఖ బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన కంపెనీల షేర్లకు రెక్కలొచ్చాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కొనసాగుతుందనే సంకేతాలతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లను కొనేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపించారు. హిండెన్‌బర్గ్‌ నివేదికతో కుంగిపోయిన అదానీ గ్రూప్‌ షేర్లు గత వారం నుంచి మళ్లీ లాభాల బాట పట్టాయి. సోమవారం ఒక్క రోజే అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్‌ కంపెనీల షేర్ల మార్కెట్‌ విలువ (మార్కెట్‌ క్యాప్‌) రూ.71,380 కోట్లు పెరిగి రూ.12 లక్షల కోట్లకు చేరింది. దీంతో గౌతమ్‌ అదానీ వ్యక్తిగత సంపద విలువ 6,580 కోట్ల డాలర్లకు చేరింది. (సుమారు రూ.5.46 లక్షల కోట్లు) చేరింది. ఈ ర్యాలీతో అదానీ మరోసారి ప్రపంచంలోని టాప్‌-20 సంపన్నుల జాబితాలోకి చేరినట్లు బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ వెల్లడించింది.

ఈ ఏడాది జనవరిలో అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌.. అదానీ గ్రూపుపై పలు ఆరోపణలు చేస్తూ ఓ రిపోర్ట్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం అనంతరం ఆ సమయంలో అదానీ గ్రూపు కంపెనీల షేర్ల అమ్మకాలు పడిపోయాయి. అప్పటివరకు ప్రపంచ అగ్రగామి కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న గౌతమ్‌ అదానీ, హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్ అనంతరం నెల రోజుల్లోనే టాప్ 25 మంది కుబేరుల జాబితాలోనే లేకుండా పోయారు. తాజా పరిణామాలతో మళ్లీ ఆ జాబితాలో 20 వ స్థానంలో నిలిచారు.




Updated : 5 Dec 2023 11:17 AM IST
Tags:    
Next Story
Share it
Top