ఒడిశా రైలు ప్రమాదం..ఇంకా మార్చురీలోనే మృతదేహాలు
X
దేశంలోనే అతి పెద్ద రైలు ప్రమాదాలలో ఒడిశా రైలు ప్రమాదం ఒకటి. జూన్ 2 న బాలాసోర్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మూడు రైళ్లు ఢీ కొన్న ఘటనలో సుమారు 291 మంది ప్రాణాలు కోల్పోయారు. వేయి మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేంద్రం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. అయితే నెల రోజులవుతున్నా.. మృతదేహాల అప్పగింత ఈ ప్రక్రియా ఇంకా కొనసాగుతునే ఉంది. 52 మృతదేహాలను ఎవరూ గుర్తించకపోవడంతో ఇంకా మార్చురీలో ఉంచారు. ఈ మృతదేహాలను భువనేశ్వర్ ఎయిమ్స్‌లో భద్రపరిచారు.మొత్తం 81 మంది మృతదేహాలు ఉండగా..వాటిలో 29 మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షలు ద్వారా గుర్తించారు. ఇంకా 52 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. గుర్తించిన వాటిలో ఐదు మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (BMC) మేయర్ సులోచనా దాస్ తెలిపారు.
బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పరిహారం ప్రకటించంతో మొదట కొన్ని తలనొప్పులు ఎదురయ్యాయి. పరిహారం కోసం కొంత మంది చనిపోయిన వారిలో తమ కుటంబసభ్యులు ఉన్నారంటూ అధికారులను ఆశ్రయించారు. దీనిపై అప్రమత్తమైన అధికారులు..డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. . ఒకవేళ కుటుంబ సభ్యులు మృతదేహాలను తమ స్వస్థలాలకు తీసుకెళ్లకూడదని భావిస్తే.. వారు భువనేశ్వర్‌లోనే అంతక్రియలు నిర్వహించుకునేందుకు బీఎంసీ ఏర్పాట్లు చేసింది.