Home > జాతీయం > నేపాల్‌లో మిస్సైన హెలీకాప్టర్ కుప్పకూలింది...ఆరుగురు మృతి

నేపాల్‌లో మిస్సైన హెలీకాప్టర్ కుప్పకూలింది...ఆరుగురు మృతి

నేపాల్‌లో మిస్సైన హెలీకాప్టర్ కుప్పకూలింది...ఆరుగురు మృతి
X

నేపాల్‌లో మిస్సైన హెలీకాప్టర్ ఘటన విషాదంగా మారింది. ఎవరెస్టు శిఖరం సమీపంలో హెలీకాప్టర్ కుప్పకూలినట్లు అధికారులు గుర్తించారు. దాంట్లో ప్రయాణిస్తున్న ఆరుగురు చనిపోయారు. సోలుకుంభు నుంచి కాఠ్‌మాండూకు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

9ఎన్‌-ఏఎంవీ కాల్‌ సైన్‌తో వ్యవహరించే హెలికాప్టర్‌ సోలుకుంభులోని సుర్కీ అనే ప్రదేశం నుంచి మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో గాల్లోకి ఎగిరింది. ఎగిరిన 15 నిమిషాల తర్వాత కంట్రోల్‌ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయాయి. హెలికాప్టర్ అదృశ్యం కాగానే రంగంలోకి దిగిన అధికారులు దానిని వెతికేందుకు ఓ హెలికాప్టర్‌ను పంపారు. దాని ఆచూకీ కనుగొనేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కాని చివరికి లిఖుపికే రూరల్‌ మున్సిపాలిటీ ప్రాంతంలో కూలినట్లు తేల్చారు. ఈ ప్రాంతంలో భారీ శబ్దం వినిపించిందని స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు.. హెలికాప్టర్‌ కుప్పకూలినట్లు గుర్తించారు. కొండపైన చెట్టును ఢీకొట్టి హెలికాప్టర్ కూలినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో హెలికాప్టర్ శకలాలతోపాటు ఐదుగురి మృతదేహాలను గుర్తించారు. అయితే ఈ ఐదుగురు ఎవరు అనేది ఇంకా నిర్ధారించలేదని డీఐజీ రాజేశ్‌నాథ్ బస్తోలా తెలిపారు.


Updated : 11 July 2023 3:18 PM IST
Tags:    
Next Story
Share it
Top