ఘోర ప్రమాదం : లోయలో పడ్డ వాహనం.. 9మంది మృతి
Sriharsha | 22 Jun 2023 1:42 PM IST
X
X
ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పితోర్‌గఢ్ జిల్లాలో బొలెరో వాహనం ప్రమాదవశాత్తు అదుపు తప్పి 600 మీటర్ల లోతైన లోయలో పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 11 మంది బాగేశ్వర్ జిల్లాలోని సామా నుంచి మున్సియరిలోని హోక్రా ఆలయ దర్శనానికి వెళ్తున్నారు.
ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి రామగంగ నది లోయలో వాహనం బోల్తాపడింది. మరో ఇద్దరు వ్యక్తులు గాయపడగా వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలం వద్ద రోడ్డు అధ్వాన్నంగా ఉండడంతో వాహనం అదుపు తప్పి లోయలో పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Updated : 22 Jun 2023 1:42 PM IST
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire