క్రికెటర్‌తో డేటింగ్‌పై స్పందించిన సారా అలీఖాన్
X
నవాబుల వారసురాలు.. పటౌడి యువరాణి. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్ ల గారలపట్టి యువ నటి సారా అలీ ఖాన్. సారా వెనకాల ఇన్ని ట్యాగ్‌లు ఉన్నప్పటికీ నటిగా తనను తాను ప్రూవ్ చేసుకునేంకదు ఎంతో కష్టపడుతుంది. అధిక బరువు కారణంగా ఒకప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొన్న సారా కఠోర శ్రమతో సన్నని తీగలా తయారయ్యి బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తోంది. కేదార్‌నాథ్ సినిమాతో నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ తనదైన అందం, అభినయంతో అందిరి హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుంటోంది. అయితే గత కొంత కాలంగా సారా భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో డేటింగ్ చేస్తోందనే పుకార్లు నెట్టింట్లో బాగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై సారా తనదైన స్టైల్లో స్పందించింది. క్రికెటర్‌ను పెళ్లి చేసుకోవడంలో తనకెలాంటి ఇబ్బంది లేదని చెప్పింది ఈ బ్యూటీ కానీ అందుకు ఓ కండీషన్‌ను కూడా పెట్టింది.
సారా అలీఖాన్ ప్రస్తుతం విక్కీ కౌశల్‌తో నటించిన జర హట్ కే జర బచ్ కే' చిత్రం ప్రమోషన్‌లో బిజీబిజీగా ఉంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సారా తన వివాహం గురించి కాబోయే భర్త గురించి జర్నలిస్టు అగిడిన ప్రశ్నకు బదులిస్తూ.." నన్ను, నా మానసిక, ఆధ్యాత్మిక విలువలను గౌరవించే, నాకు పెర్ఫెక్ట్ అనిపించే వ్యక్తి దొరికినప్పుడు అతనితో తప్పకుండా నా లైఫ్ జర్నీని ప్రారంభిస్తాను. ఈ రంగంలోనే ఉండాలనే రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. వాటిని నేను పెద్దగా పట్టించుకోను. ఏ రంగానికి చెందినవాడైనా సరే, అతను క్రికెటర్, నటుడు, వ్యాపారవేత్త అయినా పర్వాలేదు. నా విలువలను గౌరవిస్తే చాలు. " అని చెప్పుకచ్చింది సారా అలీ ఖాన్. అంతే కాదు క్రికెటర్‌తో డేటింగ్‌లో ఉన్నానంటూ వస్తోన్న రూమర్లపైన సారా స్పందించింది. ఇప్పటి వరకు తన లైఫ్ పార్టనర్‌ను కలవలేదని, కలిశానని అనుకోవడం లేదని చెప్పింది.