Home > జాతీయం > గుండెలు పిండే విషాదం.. వేటగాళ్ల ఆటలకు ఆరేళ్ల ఏనుగు బలి

గుండెలు పిండే విషాదం.. వేటగాళ్ల ఆటలకు ఆరేళ్ల ఏనుగు బలి

గుండెలు పిండే విషాదం.. వేటగాళ్ల ఆటలకు ఆరేళ్ల ఏనుగు బలి
X

వేటగాళ్ల దుర్మార్గానికి అమాయక అడవి జంతువులు బలవుతుంటాయి. ఫారెస్ట్ ఆఫీసర్ల కళ్లు కప్పి అక్రమంగా వేటాడుతుంటారు. తాజాగా కోయంబత్తూరు-ఊటీ సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన దారుణ ఘటన జంతు ప్రేమికులను తీవ్రంగా బాధించింది. పాపం నొప్పి భరించలేక సాయం కోసం ఓ ఏనుగు చేసిన ఆర్తనాదాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. విషయానికొస్తే.. కోయంబత్తూరు-ఊటీ సమీపంలోని అటవీ ప్రాంతంలో తరచూ దుండగులు వేటాడుతుంటారు. ఈ క్రమంలో అడవి పందుల కోసం వేటగాళ్లు నాటు బాంబులు ఏర్పాటు చేశారు. దాన్ని పండుగా భావించిన ఆరేళ్ల ఏనుగు.. నోటిలోకి తీసుకుని కొరకడంతో నోటిలో ఒక్కసారిగా నాటు బాంబు పేలింది.





ఈ పేలుడుతో తీవ్రంగా గాయమై రక్త శ్రావం అయింది. నొప్పి భరించలేని ఏనుగు సాయం కోసం రోడ్డుపై అటు ఇటు పరిగెత్తింది. రక్తం కారుతుండగా అరుస్తూ ఆర్తనాదాలు చేసింది. చివరికి ఓ గ్రామ సమీపంలో మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వీడియో చూసిన నెటిజన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాగా తరచూ అడవి పందులు పొలాలపై దాడికి పాల్పడుతున్నాయని అక్కడ పండ్ల మద్య నాటు బాంబులు పెట్టి ఉంచుతారు. అవి పండ్లు అనుకుని జంతువులు కొరకగా.. బాంబు నోటిలో పేలి చనిపోతుంటాయని ఫారెస్ట్ అదికారులు చెప్పుకొచ్చారు.




Updated : 7 Sep 2023 7:00 AM GMT
Tags:    
Next Story
Share it
Top