Home > జాతీయం > CM Sidda Ramaiah : కర్ణాటక ప్రభుత్వానికి బాంబు బెదిరింపు

CM Sidda Ramaiah : కర్ణాటక ప్రభుత్వానికి బాంబు బెదిరింపు

CM  Sidda Ramaiah : కర్ణాటక ప్రభుత్వానికి బాంబు బెదిరింపు
X

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుళ్ల మరువక ముందే మరోసారి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. శనివారం పబ్లిక్ ప్లేసులో బాంబు దాడులు చేయన్నట్లు సీఎం సిద్ద రామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, హోంమంత్రి, బెంగ‌ళూర్ పోలీస్ క‌మిష‌న‌ర్‌ల‌ను ఉద్దేశించి అజ్ఞాత వ్య‌క్తి ఈ మెయిల్ పంపాడు. ఈ-మెయిల్ పంపిన వ్య‌క్తిని షాహిద్ ఖాన్‌గా గుర్తించారు. ఈమెయిల్‌లో పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం రెస్టారెంట్లు, ఆల‌యాలు, బ‌స్సులు, రైళ్లు వంటి ర‌ద్దీ ప్ర‌దేశాల్లో పేలుడు జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. బ‌హిరంగ కార్య‌క్ర‌మాల్లో బాంబుల‌ను కూడా అమ‌రుస్తామ‌ని మెయిల్ పంపిన వ్య‌క్తి హెచ్చ‌రించాడు.

పేలుడుకు పాల్ప‌డ‌కుండా ఉండేందుకు త‌మ‌కు రూ. 20 కోట్లుపైగా చెల్లించాల‌ని నేర‌గాళ్లు డిమాండ్ చేసిన‌ట్టు మెయిల్ హెచ్చ‌రించింది. కాగా ఈ వ్య‌వ‌హారంపై సుమోటోగా కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. అయితే ఇటీవల బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు చోటుచేసుకోగా.. 10 మంది గాయపడ్డారు. బస్సులు, రైళ్లు, దేవాలయాలు, హోటళ్లతో పాటు అంబారీ ఉత్సవాల్లో పేలుడు పదార్థాలను అమర్చినట్లు పేర్కొన్నారు. బెదిరింపులు రావడంతో రంగంలోకి దిగిన అధికారులు సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి తక్షణ దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే బెంగళూరులో పేలుళ్లకు పాల్పడతామని బెదిరింపు మెయిల్ రావడంతో కర్ణాటక పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్నారు.




Updated : 5 March 2024 10:36 AM GMT
Tags:    
Next Story
Share it
Top