రేపటికి వాయిదా పడ్డ పార్లమెంటు ఉభయసభలు
X
వర్షాకాలం పార్లమెంటు సమావేశాలు ఈరోజే మొదలయ్యాయి. ప్రారంభ రోజే మణిపూర్ అంశం ఉభయ సభలను దడదడలాడించింది. అక్కడ జరుగుతున్న అల్లర్లు, ఘటనల మీద స్పందించాలని విపక్షాలు ఆందోళన చేశాయి. దీంతో రెండు సభలూ రేపటికి వాయిదా పడ్డాయి.
సభలు మొదలు అవ్వడమే మణిపూర్ అంశంతో అయ్యాయి. విపక్షాలు ఆందోళనకు దిగాయి. రెండు సార్లు స్వల్ప వ్యవధి వాయిదా వేసినప్పటికీ సభ్యులు మళ్ళీ ఆందోళన చేపట్టారు. సభ సజావుగా జరగకూడదనే ఉద్దేశంతోనే విపక్షాలు ఉన్నాయని రాజ్యసభపక్ష నేత పీయూష్ గోయల్ అన్నారు. ప్రతిపక్షాల తీరు మీద మండిపడ్డారు. మణిపూర్ అంశం మీద చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది అయినా కూడా విపక్షాలు గొడవచేశాయని ఆయన ఆరోపించారు.
మరోవైపు లోక్ సభ పరిస్థితి కూడా ఇలానే అయింది. మణిపూర్ అంటూ ప్రతిపక్షాలు నినాదాలు చేశాయి. మణిపూర్ కాలిపోతోంది అంటూ గొడవకు దిగాయి. మధ్యాహ్సం 2 వరకు ఎలాగోలా సాగించినా...తరువాత మాత్రం సభను వాయిదా వేయాల్సి వచ్చింది. స్పీకర్ ఎంత చెప్పినా సభ్యలు శాంతిచకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చర్చలు ప్రారంభమైన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూర్తి వివరణ ఇస్తారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. ఈ చర్చకు స్పీకర్ సమయాన్ని కేటాయిస్తారని చెప్పారు.