సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్ సర్జరీ
X
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెదడులో బ్లీడీంగ్ కావడంతో ఈ నెల 17న ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మెదడు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. మెదడులో భారీ వాపు, రక్తస్రావం కావడంతో వెంటనే ఆయనను అపోలో ఆసుపత్రిలో చేరారు. అదే రోజు వైద్యుల బృందం ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించింది. సద్గురు ఆరోగ్యంపై జర్నలిస్ట్ ఆనంద్ నరసింహన్ సోషల్ మీడియాలో అప్‌డేట్ ఇచ్చారు. సద్గురు గత కొద్దిరోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
సమాచారం మేరకు సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు డాక్టర్ వినీత్ సూరీ ఆధ్వర్యంలో పరీక్షలు చేశారు. ఆయన సూచనతో ఎంఆర్‌ఐ చేయించుకున్నారు. పరీక్షల్లో మెదడులో భారీగా రక్తస్రావం జరిగినట్లుగా గుర్తించారు. 17న ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో పాటు పలుసార్లు వాంతులు చేసుకున్నారు. తీవ్రమైన తలనొప్పితో ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత సీటీ స్కాన్ చేయగా రక్తస్రావంతో పాటు మెదడులో తీవ్రమైన వాపు సైతం ఉన్నట్లు తేలింది. దీంతో ఢిల్లీ అపోలోకు చెందిన డాక్టర్లు వినిత్ సూరీ, ప్రణవ్ కుమార్, సుధీర్ త్యాగి, ఎస్ ఛటర్జీ నేతృత్వంలోని బృందం ఆయనకు అత్యవసర శస్త్ర చికిత్స చేసింది. ఆపరేషన్ తర్వాత ఆయన మాట్లాడిన వీడియోను షేర్ చేశారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.