Home > జాతీయం > Breaking: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా

Breaking: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా

Breaking: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా
X

అంతా భావించినట్లే జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. జార్ఖండ్ సీఎం పదవికి జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో JMM శాసనపక్ష నేతగా చంపై సోరెన్ ఎన్నికయ్యారు. జార్ఖండ్ తదుపరి సీఎంగా చంపై సోరెన్ ఎన్నికయ్యారు. ఈ మేరకు చంపై సోరెన్ రాజ్ భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఈ క్రమంలో జేఎంఎం ఎమ్మెల్యేలు రాజ్ భవన్‌కు చేరుకుంటున్నారు. ల్యాండ్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

మనీలాండరింగ్‌ కేసులో సీఎం హేమంత్‌ సోరెన్‌ను విచారించేందుకు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాంచీలోని ఆయన నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. 7 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు మధ్య హేమంత్ సోరెన్‌ను ఈడీ విచారణ జరిపింది. విచారణ పూర్తి కాగానే.. హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సీఎంను అరెస్ట్ చేస్తే జార్ఖండ్‌లో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని.. ముందస్తుగానే భావించిన ఈడీ అధికారులు.. భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. కేవలం రాంచీలోనే కాకుండా జార్ఖండ్ వ్యాప్తంగా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.

మరోవైపు ఈడీ అధికారులపై హేమంత్ సోరెన్ కేసు పెట్టడం సంచలనంగా మారింది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద ఈడీ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ధృవా పోలీస్ స్టేషన్‌లో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ ఫిర్యాదు చేసినట్లు రాంచీ పోలీసులు తెలిపారు.

Updated : 31 Jan 2024 8:52 PM IST
Tags:    
Next Story
Share it
Top