Home > జాతీయం > శోభనం రాత్రే పెళ్లికూతురు ప్రసవం... పాపం వరుడు !

శోభనం రాత్రే పెళ్లికూతురు ప్రసవం... పాపం వరుడు !

శోభనం రాత్రే పెళ్లికూతురు ప్రసవం... పాపం వరుడు !
X

పెళ్లికి ముందు యువతీ, యువకులు ఎంజాయ్ చేయడం తప్పులేదు. కానీ దానికి లిమిట్స్ ఉండాలి. అమ్మాయిలు మరింత జాగ్రత్తగా ఉండాల్సి అవసరం ఉంది. ఏదైనా జరగారని తప్పు జరిగితే జీవితాలే తలక్రిందులవుతాయి. తమతో పాటు కుటుంబ సభ్యులు అవమానాలు, బాధలు పడాలి. కానీ కొందరు ఇవేమీ పట్టించుకోకుండా పెళ్లి కి ముందు ప్రియుడితో బంధాలను ఏర్పారచుకుంటున్నారు. శారీరకంగా కలిసి తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ నూతన వరుడికి ఊహించని షాక్ తగిలింది. ఫస్ట్ నైటే రోజే వధువు కడుపుతో ఉందని తెలిసి కళ్లుబైర్లుగమ్మాయి. నీకో దండం..నువ్వు వద్దు అంటూ దెబ్బకు తెగతెంపులు చేసుకున్నాడు.

పూర్తి వివరాలు చూస్తే... సికింద్రాబాద్‎కు చెందిన ఓ యవతికి గ్రేటర్ నోయిడా లోని యువకుడితో జూన్ 26న వివాహం జరిగింది. ఆ పెళ్లి రోజు రాత్రి వధువుకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. యువతిని పరిశీలించి..డాక్టర్లు చెప్పిన విషయానికి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ఏడు నెలల గర్భిణి అని చెప్పడంతో పెళ్ళికొడుకు ఖంగు తిన్నాడు. ఆ మరుసటిరోజే వధువు పడంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ముందే తెలిసినా..

తమ కుమార్తె గర్భిణీ అని ముందే తెలిసినా ఆమె తల్లిదండ్రులు విషయాన్ని దాచి పెట్టారు. వరుడి కుటుంబ సభ్యులకు కట్టుకథలు చెప్పి వివాహం జరిపించారు.

కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్ చేయడంతో కడుపు ఉబ్బిందని చెప్పి వారిని నమ్మించారు. అత్తవారి మాటలను నమ్మిన వరుడు పెళ్లి చేసుకున్నాడు. తర్వాత విషయం తెలిసి కుమిలిపోయాడు. అయితే ఘటనపై ఎవరూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయకుండా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకున్నారు. పిల్లల తల్లి తనకొద్దు అంటూ వధువును వరుడు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. దీంతో ఎవరు దారి వారు చూసుకున్నారు. మొత్తానికి పెళ్లైన రోజే వధువు తల్లి కావడం, పెళ్లి పెటాకలవ్వడం హాట్ టాపిక్‎గా మారింది.


Updated : 30 Jun 2023 5:42 PM IST
Tags:    
Next Story
Share it
Top