Home > జాతీయం > తాళి కడుతుండగా ఇష్టం లేదని చెప్పేసింది.. షాక్‌లో వరుడు

తాళి కడుతుండగా ఇష్టం లేదని చెప్పేసింది.. షాక్‌లో వరుడు

తాళి కడుతుండగా ఇష్టం లేదని చెప్పేసింది.. షాక్‌లో వరుడు
X

ఆ అమ్మాయి వయస్సు 21. అతనికి 29. విదేశాల్లో ఉద్యోగం చేస్తూ.. సెలవుల నిమిత్తం సొంతూరికి వచ్చిన అతడికి .. తమ కూతురినిద్దామనుకున్నారు ఆ అమ్మాయి తల్లిదండ్రులు. అబ్బాయి తరపు వాళ్లతో అన్ని మాట్లాడి వివాహానికి ముహూర్తం నిశ్చయించారు. సోమవారం ఉదయం ఓ ఆలయంలో వివాహం చేయాలని నిర్ణయించారు. బంధువుల సమక్షంలో వధూవరులు వివాహ రిజిస్టర్‌లో సంతకాలు చేశారు. పూలమాలలు మార్చుకున్నారు. తీరా తాళి కడుతుండగా.. తనకు అతనితో పెళ్లి ఇష్టం లేదని తేల్చి చెప్పేసింది ఆ వధువు. తమిళనాడులోని రామనాథపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది.





రామనాథపురం జిల్లా తిరువాడానై వద్ద ఉన్న ఓ గ్రామానికి చెందిన యువకుడికి.. పక్క గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువతితో వివాహం నిశ్చయించారు. సోమవారం ఉదయం తిరువాడానైలో ఉన్న ఓ ఆలయంలో మరికాసేపట్లో పెళ్లి జరుగుతందనగా.. వరుడితో పాటు అతని బంధువులకు వధువు గట్టి షాకిచ్చింది. అతడు ఆమె మెడలో తాళికట్టబోతున్న సమయంలో తాళిని లాక్కొని తనకి పెళ్లి ఇష్టంలేదని తెలిపింది. అక్కడున్న హుండీలో తాళిని వేయడానికి యత్నించింది. బంధువులు సమాధానపరచడానికి యత్నించినా ఆమె వినలేదు. దీంతో వరుడు దీనిపై పోలీసులకు ఫిర్యాదుచేశాడు.





ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారించారు. అప్పుడు ఆమె తల్లిదండ్రుల బలవంతం కారణంగా పెళ్లికి అంగీకరించినట్లు, తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిపింది. మరోవైపు వరుడి ఇంట్లో ఏర్పాటుచేసిన వివాహ వింధులో పాల్గొన్న బంధువులు వివాహం ఆగిపోయిన విషయం తెలియక చదివింపులు కూడా ఇచ్చి వెళ్లారు.




Updated : 23 Aug 2023 10:32 AM IST
Tags:    
Next Story
Share it
Top