Home > జాతీయం > 'గంగలో ముంచితే మనమేం చేయగలం..?'.. రెజ్లర్ల నిరసనపై బ్రిజ్ భూషన్ కామెంట్స్

'గంగలో ముంచితే మనమేం చేయగలం..?'.. రెజ్లర్ల నిరసనపై బ్రిజ్ భూషన్ కామెంట్స్

గంగలో ముంచితే మనమేం చేయగలం..?.. రెజ్లర్ల నిరసనపై బ్రిజ్ భూషన్ కామెంట్స్
X

రెజ్లర్లు తమ మెడల్స్ గంగలో పారేస్తామని చెబుతూ హెచ్చరించిన నేపథ్యంలో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దమనిషి, భారత రెజర్ల సమాఖ్య(WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. రెజ్లర్లు వారి పతకాలను గంగలో ముంచితే మనమేం చేయగలం..? అని అన్నారు. రెజ్లర్లు తమ మెడల్స్ ని గంగా నదిలో పారేయడానికి వెళ్లారు..కానీ గంగలో విసిరేయకుండా.. వాటిని రాకేష్ టికాయత్ కు ఇచ్చారు. అది వారి నిర్ణయం.. మనం ఏం చేయగలం..? అని అన్నారు.

ఢిల్లీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం, ఇప్పుడు మన చేతుల్లో ఏం లేదు అని ఆయన అన్నారు. వారు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదని.. వారు మాత్రమే దీనికి సమాధానం చెప్పాలని, వారి అభ్యర్థన మేరకే తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందని అన్నారు. ‘రాజీనామా చేసే ప్రసక్తే లేదని.. నా పదవి కాలం ముగిసింది, ఎన్నికలు జరుగుతాయి’ అని ఆయన స్పష్టం చేశారు. నేను తప్పు చేసినట్లు తేలితే, నన్ను అరెస్టు చేస్తారు. దానితో నాకు ఎలాంటి సమస్య లేదు అని చెప్పారు.

మంగళవారం రోజున హరిద్వార్ వెళ్లిన రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, సంగీతా ఫోగట్ గంగా నదిలో పతకాలను పారేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ సమయంలో వారంతా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రైతు సంఘాల నేతలు వారించడంతో వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. . బ్రిజ్ శరణ్ అరెస్ట్ పై ప్రభుత్వానికి 5 రోజుల అల్టిమేటం విధించారు. ఆరు సార్లు ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ సింగ్ పై లైంగిక వేధింపుల కేసులో రెండు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి.

Updated : 31 May 2023 9:56 AM IST
Tags:    
Next Story
Share it
Top