Home > జాతీయం > నూతన పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాల్సిందే : కవిత

నూతన పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాల్సిందే : కవిత

నూతన పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాల్సిందే : కవిత
X

నూతన పార్లమెంటులో ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించడంతోపాటు పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరును పెట్టాలని భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్ చేస్తున్న డిమాండ్‎కి తెలంగాణ ప్రజల మద్దతు ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ విచ్చేసిన భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్‌తో కవిత భేటీ అయ్యారు. సుమారు గంట పాటు వీరి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తమ రాజకీయ విధానాలు, తెలంగాణలో అమలవుతున్న వివిధ పథకాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని ఆజాద్ ప్రశంసించారు.

అనంతరం కవిత, చంద్రశేఖర్ ఆజాద్‌ సచివాలయం వద్ద ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించారు. అమర జ్యోతి వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ " తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించడంతో పాటు సీఎం కేసీఆర్ ను కలుసుకోవడానికి చంద్రశేఖర్ ఆజాద్‌‌ను ఆహ్వానించినట్లు తెలిపారు. నూతన పార్లమెంట్ లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని తెలంగాణ ప్రజల మద్దతు ఉంటుందని ఉంటుందని వెల్లడించారు. ఆజాద్ వంటి భావసారూప్యత కలిగిన వారితో తమ కలిసి నడుస్తామని ప్రకటించారు.

బీఆర్ఎస్ విజయం సాధించాలి

జాతీయ పార్టీగా బీఆర్ఎస్ మారడాన్ని చంద్రశేఖర్ ఆజాద్ స్వాగతించారు. దేశంలో బీఆర్ఎస్ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఢిల్లీలో తాను నిరసన తెలిపినప్పుడు బీఆర్ఎస్ ఎంపీల వచ్చి మద్దతు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టడుగు వర్గాల ప్రజలను పైకి తీసుకురావడానికి చేస్తున్న కృషి అభినందనీయం అని కొనియాడారు. నూతన సచివాలయానికి కూడా అంబేడ్కర్ పేరు పెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. నూతన పార్లమెంట్‎లో కూడా అంబేద్కర్ విగ్రహం పెట్టి తీరాలని డిమాండ్ చేశారు.


Updated : 27 July 2023 7:39 PM IST
Tags:    
Next Story
Share it
Top