Home > జాతీయం > మ‌ణిపూర్: మ‌హిళ‌ను వేధించిన ఆ బీఎస్ఎఫ్ జ‌వాన్‌పై స‌స్పెన్ష‌న్

మ‌ణిపూర్: మ‌హిళ‌ను వేధించిన ఆ బీఎస్ఎఫ్ జ‌వాన్‌పై స‌స్పెన్ష‌న్

మ‌ణిపూర్: మ‌హిళ‌ను వేధించిన ఆ బీఎస్ఎఫ్ జ‌వాన్‌పై స‌స్పెన్ష‌న్
X

గత కొన్ని రోజులుగా అల్లర్లు, హింసాత్మక ఘటనలతో రగిలిపోతున్న మణిపూర్ లో రోజుకో దారుణ ఉదంతం వెలుగులోకి వస్తోంది. గతవారం ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై యావాత్తు దేశం దిగ్భాంత్రి వ్యక్తం చేసింది. అటు రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇలా రోజుకో దారుణ ఘటన బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా అల్లర్లను అరికట్టేందుకు వచ్చిన బీఎస్‌ఎఫ్‌ జవానే (BSF Jawan).. ఓ మహిళపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జులై 20న ఇంఫాల్‌లోని ఓ కిరాణా స్టోర్‌కు వచ్చిన మహిళపై అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం (BSF) జవాను అనుచితంగా ప్రవర్తించాడు. స్టోర్‌లో ఆమె ఒంటరిగా ఉండటం చూసి ఆమెను అనుసరించాడు. అసభ్యంగా తాకుతూ వేధింపులకు పాల్పడ్డాడు. యూనిఫామ్‌లో ఉన్న జవాన్‌ మహిళను ఇబ్బందిపెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అతడి దగ్గర ఇన్సాన్‌ రైఫిల్‌ ఉండటం వీడియోలో కన్పించింది.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైరల్‌ అయిన దృశ్యాల ఆధారంగా ఆ జవానును గుర్తించి సస్పెండ్‌ చేసినట్లు బోర్డ‌ర్ సెక్యూర్టీ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర పోలీసుల నుంచి ఫిర్యాదు అందుకున్న బీఎస్‌ఎఫ్.. నిందితుడిపై అంతర్గత దర్యాప్తు చేపట్టినట్లు తెలిపింది. గ్రాస‌రీ స్టోర్‌లో ఇన్‌సాస్ రైఫిల్‌తో ఉన్న అత‌న్ని హెడ్ కానిస్టేబుల్ స‌తీశ్ ప్ర‌సాద్‌గా గుర్తించారు. ప్ర‌స్తుతం అతడిని స‌స్పెండ్ చేశారు. ఆ ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ‌కు ఆదేశించారు. అరెస్టు చేసిన అత‌నిపై డిపార్ట్‌మెంట్ విచార‌ణ చేప‌డుతున్నారు.

Updated : 26 July 2023 12:53 PM IST
Tags:    
Next Story
Share it
Top