తల్లికి తిరుమల దర్శనం కాలేదని.. ఏకంగా గుడినే కట్టించాడు
X
తల్లి కోరికను తీర్చడానికి 95 ఏళ్ల వయసులో కష్టపడుతున్నాడో కొడుకు. తిరుమలలో శ్రీవారి దర్శనం సంతృప్తిగా జరగలేదని చెప్తే.. తిరుమలను కోరిన గుడిని కట్టిస్తున్నాడు. ఐదేళ్లుగా సాగుతున్న ఈ నిర్మాణం ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రంలోని పలాసకు చెందిన హరి ముకుందా పండాది రాజ కుటుంబం. పదేళ్ల కిందట మోకాళ్ల నొప్పులతో తిరుమల కొండ చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అయితే, రద్దీ కారణంగా సంతృప్తి కరంగా శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలుగలేదని నిరాశ పడ్డాడు. అదే విషయాన్ని తన తల్లికి చెప్పుకుని బాధ పడ్డాడు.
అంతే, తనకున్న పన్నెడెకరాల కొబ్బరి తోటను గుడి నిర్మాణానికి రాసిచ్చింది. వెంటనే తిరుమలను పోలిన శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని కొడుకును కోరింది. తల్లి కోరికను కాదనలేక.. తిరుమల నుంచి ఏక శిలను తెప్పించి గుడి నిర్మిణం మొదలుపెట్టాడు. దాదాపు 5 కోట్లతో నిర్మిస్తున్న ఈ గుడిలో త్వరలో దేవతలను ప్రతిష్టించబోతున్నారు.