Home > జాతీయం > బ్యాంక్‌లోకి వచ్చిన ఎద్దు.. వైరల్‌గా మారిన వీడియో

బ్యాంక్‌లోకి వచ్చిన ఎద్దు.. వైరల్‌గా మారిన వీడియో

బ్యాంక్‌లోకి వచ్చిన  ఎద్దు.. వైరల్‌గా మారిన  వీడియో
X

బ్యాంక్ సిబ్బంది ఎవరి పనులలో వారు బీజిగా ఉన్నారు. ఖాతాదారులు తమ సమస్య పరిష్కారం కోసం లైన్‌లో నిలబడి వెచి చూస్తున్నారు. ఇంతలోనే అనుకోని అతిథి బ్యాంక్‌లోకి ప్రవేశించింది. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది..ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ (Unnao)లో చోటు చేసుకుంది, ఈ ఘటనపై స్పందించిన బ్యాంక్ చీఫ్ మేనేజర్ గౌరవ్ సింగ్, “మొదట్లో రెండు ఎద్దులు బ్యాంకు వెలుపల ఘర్షణకు దిగాయి. తర్వాత అందులో ఓ ఎద్దు బ్యాంకు ప్రవేశ ద్వారం బ్యాంక్‌లోకి ప్రవేశించింది, దీంతో బ్యాంక్‌లో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. అదృష్టవశాత్తూ, బ్యాంక్‌లో తక్కువగా కస్టమర్‌లు ఉండడంతో ఎవరికి ఎలాంటి గాయం కాలేదు. "అన్నారు."అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ 30 సెకన్ల వీడియోలో బ్యాంక్‌లో ఎద్దు స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. అంతలో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ ఎద్దును బయటకు పంపేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. "ఇది SBI స్టాక్‌కి సంకేతమా... SBIలోకి ప్రవేశించిన బుల్ vs మార్కెట్‌లో SBI బుల్‌ పరుగుకు సంకేతం?" ఇది సంకేతం అని నెటిజన్ కామెంట్ చేయగా.. రద్దైనా నోట్లను మార్చుకోవడానికి వెళ్ళి ఉంటుంది" అని మరొక్క నెటిజన్ కామెంట్ చేశాడు. “పక్కా నెట్‌ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ ఇవ్వనట్లు ఉన్నారు” అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు

Updated : 11 Jan 2024 1:37 PM IST
Tags:    
Next Story
Share it
Top