Home > జాతీయం > ICUలోనికి రానివ్వలేదని ఆస్పత్రిపై బుల్డోజర్ చర్య.. యూపీలోనే

ICUలోనికి రానివ్వలేదని ఆస్పత్రిపై బుల్డోజర్ చర్య.. యూపీలోనే

ICUలోనికి రానివ్వలేదని ఆస్పత్రిపై బుల్డోజర్ చర్య.. యూపీలోనే
X

ఐసీయూ గదిలోకి రానివ్వలేదని ఆసుపత్రిపై బుల్డోజర్ చర్యకు సిద్ధపడ్డారు ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూ మున్సిపల్​ కార్పొరేషన్​​ మేయర్​. షూ వేసుకుని ఐసీయూ గదిలోకి వెళ్లొద్దన్నందుకు ఆస్పత్రి స్టాఫ్​తో గొడవపడి.. బుల్డోజర్ చర్యకు పిలుపునిచ్చారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలో తీవ్ర రసాభాస జరిగింది.

ఆసుపత్రి మేనేజ్​మెంట్​ చెప్పిన వివరాల ప్రకారం.. బిజ్​నోర్​లో ఉన్న వినాయక్ మెడికేర్ ఆస్పత్రిలో.. మున్సిపల్​ ఉద్యోగి ఒకరు అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఆ రోగిని చూసేందుకు మిగతా సిబ్బందితో కలిసి.. లక్నో మున్సిపల్​ మేయర్​ సుష్మా ఖర్వాల్ సోమవారం అక్కడికి వెళ్లారు. షూ వేసుకుని ఐసీయూ గదిలోకి ప్రవేశిస్తున్న ఆమెను.. అస్పత్రి సిబ్బంది అడ్డుకున్నారు. షూ వేసుకుని లోపలికి వెళితే.. రోగి ఇన్ఫెక్షన్​ బారిన పడతారని హెచ్చరించారు. షూ విప్పేసి ఐసీయూ గదిలోకి వెళ్లాల్సిందిగా ఆమెను కోరారు. దీంతో ఆగ్రహానికి గురైన మేయర్ సుష్మా ఖర్వాల్​​.. ఆస్పత్రి సిబ్బందిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఆస్పత్రి మేనేజ్​మెంట్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.. ఈ క్రమంలోనే ఇద్దరికు​ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.





ఆగ్రహానికి లోనైన మేయర్.. వెంటనే బుల్డోజర్ ఆస్పత్రి వద్దకు రావాలని మున్సిపల్​ సిబ్బంది, ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్​ను ఆదేశించారు. వెంటనే వారంతా అక్కడికి చేరుకోవడం వల్ల ఆస్పత్రి ప్రాంగణంలో తీవ్ర రసాభాస జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ప్రస్తుతానికి ఆస్పత్రిపై మున్సిపల్​ సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఆస్పత్రి నిర్మాణం అక్రమంగా జరిగిందని మున్సిపల్​ అధికారులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. మరికొద్ది రోజుల్లో ఆస్పత్రిపై చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. అయితే షూ వేసుకుని ఐసీయూ గదిలో వెళ్లిన ఆరోపణలను మేయర్​ సుష్మా ఖర్వాల్ ఖండించారు​​. తమ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు అందుతున్న సేవల గురించి తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు.







Updated : 23 Aug 2023 8:34 AM IST
Tags:    
Next Story
Share it
Top