Home > జాతీయం > బుల్డోజర్‌తో మూత్ర విసర్జన చేసిన వ్యక్తి ఇల్లు కూల్చివేత

బుల్డోజర్‌తో మూత్ర విసర్జన చేసిన వ్యక్తి ఇల్లు కూల్చివేత

బుల్డోజర్‌తో మూత్ర విసర్జన చేసిన వ్యక్తి ఇల్లు కూల్చివేత
X

గిరిజనుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో పెద్ద దుమారం రేపింది. సిధి జిల్లాకు చెందిన నిందితుడు పర్వేజ్‌ శుక్లాను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బుల్డోజర్లతో ఇంటిని కూల్చివేశారు. ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రవేశ్ ఇంటి వద్దకు బుధవారం పదుల సంఖ్యలో అధికారులు వెళ్లి, అతని ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేశారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రవేశ్ మానవత్వాన్ని మరిచాడన్నారు. అమానవీయ చర్యకు పాల్పడినట్లు సీఎం పేర్కొన్నారు. దీనికి కఠినమైన శిక్ష కూడా సరిపోదన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తాను ఆదేశాలు ఇచ్చానని సీఎం చెప్పారు.





కాగా, మధ్యప్రదేశ్‌ ఘటన.. బీజేపీకి దళితులు, గిరిజనులపై ఉన్న విద్వేషాన్ని చాటుతోందని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. నిందితుడు బీజేపీ వ్యక్తి అని, ఆ పార్టీ పాలనలో ఈ వర్గాలపై దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు. యూపీ మాజీ సీఎం మాయావతి స్పందిస్తూ.. అమానుష, అత్యంత అవమానకరమైన చర్యకు పాల్పడ్డ నిందితుడి ఇంటిని కూల్చివేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు శుక్లా తమ పార్టీకి చెందినవాడంటూ వస్తున్న కథనాలను బీజేపీ ఖండించింది.




Updated : 6 July 2023 8:07 AM IST
Tags:    
Next Story
Share it
Top