Home > జాతీయం > 2026 నాటికి బుల్లెట్ రైలు పరుగులు.. అశ్వినీ వైష్ణవ్‌ కామెంట్స్

2026 నాటికి బుల్లెట్ రైలు పరుగులు.. అశ్వినీ వైష్ణవ్‌ కామెంట్స్

2026 నాటికి బుల్లెట్ రైలు పరుగులు.. అశ్వినీ వైష్ణవ్‌ కామెంట్స్
X

దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పస్ట్ ఫేస్ 2026 నాటికి పూర్తవుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. తొలుత సూరత్ నుంచి బిలిమోరా వరుకు రైలు నడుపుతామని, అహ్మదాబాద్-ముంబై మార్గం 2028కి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తొలి మేడిన్ ఇండియా చీప్‌ను తీసుకొస్తామన్నారు. ఐదేళ్లలో సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో దేశం ఐదో స్థానానికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. జపాన్ షింకన్‌సెన్ టెక్నాలజీని ఉపయోగించి హై-స్పీడ్ రైలు మార్గాన్ని కేంద్రం నిర్మిస్తున్నది. రూ.1.10 లక్షల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయాలని భావించినప్పటికీ భూసేకరణలో అడ్డంకులు ఎదురయ్యాయి. 2026 నాటికి దక్షిణ గుజరాత్‌లోని సూరత్, బిలిమోరా మధ్య మొదటి దశ బుల్లెట్ రైలును నడపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇక ఈ మొత్తం కారిడార్‌ పొడవు 508.17 కిలోమీటర్లు. ఇది అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్‌ నుంచి ముంబై చేరుకోవచ్చు.

Updated : 19 March 2024 9:54 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top