Home > జాతీయం > ఏటీఎంను పగలగొట్టిన దొంగలు.. లోపలుంది చూసి వారి దిమ్మతిరిగింది..

ఏటీఎంను పగలగొట్టిన దొంగలు.. లోపలుంది చూసి వారి దిమ్మతిరిగింది..

ఏటీఎంను పగలగొట్టిన దొంగలు.. లోపలుంది చూసి వారి దిమ్మతిరిగింది..
X

దొంగతనానికి కాదేదీ అనర్హం. మంచి వంటకాలను చూస్తే నోరూరినట్లు.. లక్షల డబ్బులుండే ఏటీఎం అంటే దొంగలకు చెయ్యి ఊరుతుంది. ఓ చోట ఏటీఎం చోరికి యత్నించిన దొంగలకు వింత అనుభవం ఎదురైంది. ఏటీంను ధ్వంసం చేసి చూశాక వారు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎందుకంటే అందులో ఒక్క నోటు కూడా లేదు. ఈ ఘటన మహారాష్ట్రంలో జరిగింది.

మాస్వాన్‌ గ్రామంలో ఉన్న ఏటీఎం చోరికి కొందరు దుండగులు యత్నించారు. తెల్లవారుజామున 2గంటలకు సీసీ కెమెరాను ధ్వంసం చేసి ఏటీఎంను పగలగొట్టారు. అయితే అందులో నగదు లేకపోవడంతో వారి దిమ్మతిరిగిపోయింది. గత కొన్ని రోజులుగా ఆ ఏటీఎం పనిచేయకపోవడంతో మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే దాంట్లో నగదును పెట్టలేదు. ఇది తెలియక చోరీకి యత్నించిన దొంగలకు మైండ్ బ్లాంక్ అయ్యింది. కాగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Updated : 20 Aug 2023 8:33 AM IST
Tags:    
Next Story
Share it
Top