Home > జాతీయం > ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరొకరి అరెస్టు.. ఇవాళ CBI స్పెషల్ కోర్టుకి..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరొకరి అరెస్టు.. ఇవాళ CBI స్పెషల్ కోర్టుకి..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరొకరి అరెస్టు.. ఇవాళ CBI స్పెషల్ కోర్టుకి..
X

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ మరొకరిని అరెస్టు చేసింది. మనీష్ సిసోదియా సహాయకుడిగా వ్యవహరించిన దినేష్ అరోరాను ఈడీ గురువారం రాత్రి అదుపులోకి తీసుకుంది. ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు ఆయన్ను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. సీబీఐ నమోదు చేసిన కేసులో దినేష్ అరోరా అప్రూవర్‌గా మారారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి ఇంకా లోతుగా విచారించాల్సి ఉన్నందున దినేష్ ఆరోరాను కస్టడీ కోరాలని ఈడీ భావిస్తుంది.

ఆప్ కమ్యూనికేషన్ ఇంచార్జీ విజయ్ నాయర్ తో ఆయన సన్నిహితంగా వ్యవహరించారని ఈడీ గతంలో దాఖలు చేసిన చార్జీషీట్ లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఆరోరా కలిశారని ఈడీ గతంలో ఆరోపణలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.అంతకుముందు పలుమార్లు ఈ కేసు విషయమై ఆయనను సీబీఐ అధికారులు విచారించారు. ఈ కేసులో అరెస్టైన మనీష్ సిసోడియా తీహార్ జైలులో ఉన్నాడు. ఇదే కేసులో మనీష్ సిసోడియాను ఈడీ అధికారులు ఈ ఏడాది మార్చి 9వ తేదీన అరెస్ట్ చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం దేశంలోని పలు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఆప్ సహా బీఆర్ఎస్ పై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలను ఆప్, బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించాయి.




Updated : 7 July 2023 5:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top