Home > జాతీయం > ఫోన్​ కొంటే 2 కిలోల టమాటాలు ఫ్రీ.. ఎక్కడంటే?

ఫోన్​ కొంటే 2 కిలోల టమాటాలు ఫ్రీ.. ఎక్కడంటే?

ఫోన్​ కొంటే 2 కిలోల టమాటాలు ఫ్రీ.. ఎక్కడంటే?
X

ప్రస్తుతం టమాటాలు బంగారమయ్యాయి. భారీ ధరలతో చుక్కలను తాకుతున్నాయి. గత కొన్ని రోజులుగా సెంచరీ మీదున్న కిలో టమాటా.. ఇప్పుడు ఏకంగా డబుల్ సెంచరీ దాటేసింది. టమాటాలు కొనేందుకు సామాన్యుడు వెనకడుగు వెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. మెక్ డొనాల్డ్ వంటి సంస్థలు సైతం తమ మెనూ నుంచి టమాటాలు తొలగించినట్లు వార్తలు రావడం ప్రస్తుత పరిస్థితి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ క్రమంలో ఓ సెల్ ఫోన్ షాప్ ఓనర్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తన సేల్స్ను పెంచుకునేందుకు ఫోన్ కొంటే 2కిలోల టమాటాలు ఉచితమంటూ క్రేజీ ఆఫర్ ప్రకటించాడు.

మధ్యప్రదేశ్​లోని అశోక్​నగర్​ పట్టణంలో అశోక్ అగర్వాల్ అనే వ్యక్తి ఓ సెల్​ఫోన్ షాప్​ నడుపుతున్నాడు. కొన్ని రోజులుగా టమాటా ధరలు పెరగడం, సామాన్యులు ఇబ్బందులు పడడం గమనించాడు. దానిని తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నాడు. దీంతో తన షాపులో స్మార్ట్​ఫోన్​​ కొనుగోలు చేసినవారికి రెండు కిలోల టమాటాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. దీన్ని చూసిన కస్టమర్లు అశోక్​ షాపుకు క్యూ కట్టారు. ఈ ఆఫర్​ వల్ల కస్టమర్ల సంఖ్య పెరిగిందని.. స్మార్ట్​ఫోన్లు కూడా ఎక్కువగా అమ్ముడయ్యాయని అశోక్ సంతోషం వ్యక్తం చేశారు.

Updated : 8 July 2023 9:00 PM IST
Tags:    
Next Story
Share it
Top