Droupadi Murmu : మధ్యంతర బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం
X
మధ్యంతర బడ్జెట్ కు కేంద్ర మంత్రివర్గం సమావేశమయింది. కేబినెట్ ఆమోదం లభించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో జరగబోయే లోక్ సభ సమావేశాల్లో నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ డిజిటల్ రూపంలో ఉండనుంది. కాగా ఆర్థిక మంత్రిగా నిర్మల ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీంతో వరుసగా ఆరు సార్లు బడ్జెట్‌ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్ రికార్డును ఆమె సమం చేసినట్టు అయ్యింది. బడ్జెట్ ప్రవేశపెట్టేముందు నిర్మల రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకున్నారు. అక్కడ నుంచి పార్లమెంట్ చేరుకున్న నిర్మల.. కేంద్ర కేబినెట్ తో భేటీ అయ్యారు. లోక్ సభలో ఆర్థిక మంత్రి ప్రసంగం తర్వాత.. యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌లో బడ్జెట్ పూర్తి కాపీని చూడొచ్చు. దీంతోపాటు www.indiabudget.gov.in పోర్టల్‌లోనూ బడ్జెట్ కాపీ లభిస్తుంది.