Home > జాతీయం > PM-Surya Ghar: పీఎం సూర్య ఘర్ యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం

PM-Surya Ghar: పీఎం సూర్య ఘర్ యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం

PM-Surya Ghar: పీఎం సూర్య ఘర్ యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం
X

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో కేంద్ర కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. లోక్ సభ ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా ప్రజల కోసం కొత్త పథకాలను ప్రవేశపెట్టి.. వాటి అమలు చేసే పనిలో పడింది. ఇందులో భాగంగానే ఈ రోజు కేంద్ర మంత్రివర్గం సమావేశమై . పలు సంక్షేమ పథకాలకు ఆమోదం తెలిపింది. పీఎం సూర్య ఘర్ యోజనకు కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. రూ.75,021 కోట్ల నిధులతో ప్రారంభించనున్న ఈ పథకం.. ద్వారా 2025 నాటికి కేంద్ర కార్యాలయాలపై సోలార్ ప్యానల్ లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటుగా దేశంలోని కోటి గృహాలకు ఉచితంగా సోలార్ విద్యుత్ ను అందించనున్నారు. ఈ పథకంలో భాగంగా అర్హత ఉన్న ప్రతి ఇంటికి దాదాపు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ లభించనుంది.

సౌర విద్యుత్ వినియోగం పెంచేందుకు కేంద్రం చర్యలు తీసకుంది. రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుకు వెబ్ సైట్ లో దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ నెల 13న పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. https://pmsuryaghar.org.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. PSUలు NTPC, NHPC, PFC, పవర్ గ్రిడ్, NIPCO, SGVN, THDC, గ్రిడ్ ఇండియా ఈ పథకాన్ని పర్యవేక్షిస్తాయి.

ఇందుకోసం కేంద్రం పలు సోలార్ సబ్సిడీలను కూడా ఈ రోజు ప్రకటించింది. ఇందులో భాగంగా.. 1kW సిస్టమ్స్ కోసం రూ. 30000, 2kW సిస్టమ్స్ కోసం రూ. 60000 వేలు, అలాగే 3kW, అంతకంటే ఎక్కువ సిస్టమ్స్ ఏర్పాటు కోసం 78,000వేల సబ్సీడీలు ఇస్తామని కేంద్రం తెలిపింది. దేశంలోని చాలా రాష్ట్రాలు కూడా కేంద్రం ఇచ్చే రాయితీని ఇస్తామని ప్రకటించాయి. తద్వారా రూ.36000 సబ్సిడీ లభిస్తుంది. మిగిలిన సొమ్ము పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదా బ్యాంకు నుంచి రుణం పొందవచ్చు.

Updated : 29 Feb 2024 10:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top