Home > జాతీయం > Sugarcane: చెరుకు రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్!

Sugarcane: చెరుకు రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్!

Sugarcane: చెరుకు రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్!
X

చెరుకు రైతులపై మోదీ సర్కార్ కాస్త కనికరం చూపించింది. 2024-25 (అక్టోబర్-సెప్టెంబర్) సీజన్‌లో చెరుకు పంట ధరను క్వింటాల్ కు రూ. 315 నుంచి రూ. 340కి పెంచింది. క్వింటాల్ చెరుకుపై ‘ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైజ్(FRP- చెరుకు మిల్లులు రైతులకు చెల్లించాల్సిన కనీస ధర)పై రూ.25 పెంచింది. అంటే 8 శాతం పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు క్వింటాల్ చెరుకు కనీస ధర రూ.315గా ఉండగా, తాజా పెంపుతో రూ.340కి చేరనుంది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.

మోడీ హయాంలో క్వింటాల్ చెరుకుపై అత్యధికంగా రూ.25 పెంచడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (CACP) సిఫార్సుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర వాటాదారులతో సంప్రదించిన తర్వాత ఎఫ్ఆర్పీ(FRP)ని నిర్ణయిస్తారు.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 5 కోట్ల మందికి పైగా చెరుకు రైతులకు లాభం చేకూరనుంది. ప్రధాని మోదీ గత పదేళ్లుగా రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే తాజా నిర్ణయం తీసుకున్నారని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. దీంతోపాటు 2021-22 నుండి 2025-26 వరకు మొత్తం రూ.1179.72 కోట్లతో ‘మహిళల భద్రత’పై అంబ్రెల్లా స్కీమ్‌ను కొనసాగించాలనే కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రతిపాదనను సైతం ప్రభుత్వం ఆమోదించినట్టు వెల్లడించారు.

Updated : 22 Feb 2024 2:13 AM GMT
Tags:    
Next Story
Share it
Top