Home > జాతీయం > High Court : డార్లింగ్ అని పిలవడంపై ..కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు

High Court : డార్లింగ్ అని పిలవడంపై ..కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు

High Court  : డార్లింగ్ అని పిలవడంపై ..కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
X

పరిచయం లేని మహిళను డార్లింగ్ అని పిలిస్తే లైంగిక వేధింపు కిందకు వస్తుందని కలకత్తా హైకోర్టు షాకింగ్ తీర్పు ఇచ్చింది. 354ఏ, 509 సెక్షన్ల కింద అలా పిలిచిన వారిని నిందితులుగా భావించొచ్చని పేర్కొంది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి మహిళా కానిస్టేబుల్‌ను డార్లింగ్ అని పిలవడంపై దాఖలైన పిటిషన్ విచారణలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పరాయి స్త్రీలను ఇష్టం వచ్చినట్లు పిలిచే స్థాయికి భారత్ దిగజారలేదని పేర్కొంది. రోడ్డుపైన వెళ్తూ ఓ యువతినో, మహిళనో చొరవ తీసుకుని మరీ డార్లింగ్ అనే స్థాయికి భారత సంస్కృతి ఇంకా దిగజారిపోలేదని స్పష్టం చేశారు. ఇది భారదేశం సంస్కృతి కాదని వెల్లడించారు. పైగా..మద్యం మత్తులో ఇలాంటివి చేస్తే అది ఇంకా పెద్ద నేరం అవుతుందని తేల్చి చెప్పారు. ప్రాథమిక వివరాల ప్రకారం..ఓ మహిళా కానిస్టేబుల్ కోల్‌కత్తాలో దుర్గా పూజ జరుగుతుండగా అక్కడ ట్రాఫిక్‌ని కంట్రోల్ చేసేందుకు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి గలాటా చేస్తున్నాడని తెలుసుకుని వెంటనే అక్కడికి వెళ్లారు.

ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఆ సమయంలోనే నిందితుడు మహిళా కానిస్టేబుల్‌తో అనుచితంగా ప్రవర్తించాడు. "డార్లింగ్ నాకు ఫైన్ వేస్తావా" అంటూ పిచ్చిగా మాట్లాడాడు. దీనిపై కోర్టు వరకూ వెళ్లారు మహిళా కానిస్టేబుల్. డార్లింగ్ అని పిలిచినట్టు తన వద్ద అన్ని ఆధారాలున్నాయని వాదించారు. అప్పటికే కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. నిందితుడు తన తప్పుని ఒప్పుకోవడం వల్ల శిక్షను నెల రోజులకు తగ్గించినట్టు వివరించింది. ఈ తీర్పుపై పశ్చిమ బెంగాల్ మాజీ అడ్వొకేట్ జనరల్ బిమల్ ఛటర్జీ స్పందిస్తూ.. జైలు శిక్షకు బదులుగా ఒక సాధారణ హెచ్చరిక ఉంటే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. మరో సీనియర్ న్యాయవాది సుబ్రతో ముఖర్జీ ‘‘డార్లింగ్’’ అనే పదం అవమానకరమైనదిగా ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. ఆ పదం డీక్షనరీ నిర్వచనాన్ని వివరించారు. అది అభిమాన పదం అని చెప్పారు. అతడు వాడిన పదంలో దురుద్దేశం లేనందున జరిమానా విధిస్తే సరిపోతుందని సూచించారు. కానీ కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి రవీంద్రనాథ్ సామంత ఈ తీర్పును సమర్ధించారు. నిందితుడు వాడిన సందర్భంలో ఈ పదం లైంగిక వేధింపే అవుతుందని, శిక్షకు అర్హమైనదనే అని భావించారు.




Updated : 3 March 2024 8:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top