India's first UPI ATM: క్యూఆర్ కోడ్ స్కాన్ చెయ్.. ATM నుంచి డబ్బులు తియ్
X
అర్జెంట్ గా క్యాష్ కావాల్సినప్పుడు.. చేతిలో ఏటీయం కార్డ్ లేక చాలాసార్లు ఇబ్బంది పడుంటారు. ఇకపై ఏటీయం కార్డుల గొడవ పోయే అవకాశం ఉంది. కార్డు లేకుండా కేవలం ఫోన్ ద్వారా క్యాష్ విత్ డ్రా చేసుకునే రోజులు రానున్నాయి. ఈ దిశగా ముంబైలో తొలి అడుగు పడింది. తొలి యూపీఐ-ఏటీఎంను జపాన్ కు చెందిన హిటాచీ పేమెంట్ సర్వీసెస్ భారత్ కు తీసుకొచ్చింది. హిటాచీ మనీస్పాట్ ఏటీఎంగా దీన్ని ఏర్పాటుచేశారు. ముంబైలో సెప్టెంబర్ 5న జరిగిన ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2023’లో దీన్ని ఆవిష్కరించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తోర్పాటుతో దీన్ని రూపొందించారు. ఈ సర్వీస్ తో ఫోన్ నుంచి స్కాన్ చేసి ఏటీఎంలో డబ్బులు తీసుకోవచ్చన్నమాట.
ఇదెలా పనిచేస్తుందంటే?
* ఏటీఎంకి వెళ్లాక స్క్రీన్ పై కనిపించే ‘యూపీఐ కార్డ్‌లెస్ క్యాష్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* మీరు విత్‌డ్రా చేసుకోవాలనుకుంటున్న అమౌంట్ మొత్తాన్ని ఎంచుకోవాలి.
* తర్వాత స్క్రీన్ పై ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది.
* ఫోన్‌లో ఉండే యూపీఐ యాప్ (ఫోన్ పే, గూగుల్ పే)తో క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి.
* తర్వాత ట్రాన్సాక్షన్ను వెరిఫై చేస్తూ యూపీఐ పిన్‌ను యాప్‌లో ఎంటర్ చేయాలి.
* వెరిఫికేషన్ పూర్తైన వెంటనే ఏటీఎం మెషీన్ నుంచి క్యాష్ బయటకు వస్తుంది.
* మీ ట్రాన్సాక్షన్ సక్సెస్ ఫుల్ అయినట్లు యాప్‌లోనూ మెసేజ్ వస్తుంది.
UPI ATM: The future of fintech is here! 💪🇮🇳 pic.twitter.com/el9ioH3PNP
— Piyush Goyal (@PiyushGoyal) September 7, 2023