Home > జాతీయం > ఉత్తర భారతాన్ని ముంచేస్తున్న వానలు

ఉత్తర భారతాన్ని ముంచేస్తున్న వానలు

ఉత్తర భారతాన్ని ముంచేస్తున్న వానలు
X

ఎన్నడూలేని విధంగా టైమ్ కాని టైమ్ లో వర్షాలు నార్త్ ఇండియాలో దంచేస్తున్నాయి. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలకు హియాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా, జమ్మూ కశ్మీర్, ఢిల్లీలను వరదలు ముంచేస్తున్నాయి. వానల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లో 19 మంది చనిపోయారు.

ఉత్తర భారతంలో ఎగతెగకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో అక్కడ ఉన్న నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదల కారణంగా రోడ్లు, రైల్వే ట్రాక్ లు మునిగిపోయాయి. కార్లు, ఇతర వాహనలు కొట్టుకుపోతున్నాయి. సాధారణంగా ఉత్తర భారతదేశంలో ఈ కాలంలో వర్షాలు పడవు. ఇప్పడు వాళ్ళకు సమ్మర్ అనే చెప్పాలి. ముందు దక్షిణ భారతంలో రుతుపవనాలు మొదలయి తరువాత నార్త్ కు వెళతాయి. కానీ ఈ ఏడాది ఇందుకు భిన్నంగా ఇక్కడ కంటే అక్కడ భారీగా వర్షాలు పడుతున్నాయి.

రాజస్థాన్ నుంచి లడాఖ్ వరకు వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీ తడిసి ముద్దవుతోంది. 41 ఏళ్ళ తర్వాత రికార్డుస్థాయిలో ఢిల్లీలో ఇంత వర్షం కురిసింది. ఒక్క రోజులోనే 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. 1982 జూలై తర్వాత ఈ స్థాయిలో ఇంత వర్షపాతం నమోదుకావడం ఇదే మొదటిసారి. కుంభవృష్టిగా కురస్తున్న వర్షానికి చాలా చోట్ల చెట్లు, ప్రహరీ గోడలు, ఇళ్ళు కూలిపోయాయి. నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది వరకూ గాయపడ్డారు. ఇళ్ళు కూలిపోయిన ఘటనలకు సంబంధించి 13 వరకూ తమకు సమాచారం అందిందని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ తెలిపింది.

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడి వరదలకు టూరిస్టుల వాహనాలు కొట్టుకుపోతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలను ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తున్నారు. పెద్ద నదులు మనాలీ, కులు, కనౌర్, చంబాలతో పాటూ చిన్న చిన్న నదులు కూడా పొండి ప్రవహిస్తున్నాయి. వాటర్ లెవెల్ డేంజర్ మార్క్ ను దాటిపోయింది. ఈ వరదలు, కొండ చరియలు విరిగిపడడం వలన ఇప్పటి వరకు అక్కడ 19 మంది చనిపోయారు. దీంతో అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరో రెండు రోజులు ఇలాగే వర్షాలు కురుస్తాయయని జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఢిల్లీ, గురుగావ్ లలో ఈ రోజు స్కూళ్ళకు సెలవు ప్రకటించారు.







Updated : 10 July 2023 9:32 AM IST
Tags:    
Next Story
Share it
Top