Sunil Kamble : సహనం కోల్పోయిన ఎమ్మెల్యే.. పోలీసు అధికారిపై దాడి
X
మహారాష్ట్ర పూనేలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే రెచ్చిపోయాడు. పోలీసుతో దురుసుగా ప్రవర్తించారు. అసహనం ఊగిపోయిన ఎమ్మెల్యే ఓ పోలీసు అధికారిపై చేయిచేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పూనేలోని సాసూన్ హాస్పిటల్‌లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో కలిసి బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే పాల్గొన్నారు. కాసేపటికి వేదికపై నుంచి దిగుతున్న సమయంలో ఆయన తుళ్లిపడబోయాడు. దీంతో పక్కనే ఉన్న పోలీసు అధికారి చెంప పగులగొట్టాడు. అకారణంగా ఆయనపై చేయిచేసుకున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వేదికపైనే ఉన్నారు.
ఇదిలా ఉంటే పోలీస్ సిబ్బందిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే సునీల్ కాంబ్లేపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 353 కింద విధి నిర్వాహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేశారన్న కారణంతో ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.
#WATCH | Maharashtra | BJP MLA Sunil Kamble was seen slapping a Police personnel during an event at Sassoon Hospital in Pune today. Deputy CM Ajit Pawar was present on the stage at the event when the incident occurred.
— ANI (@ANI) January 5, 2024
Visuals show Sunil Kamble leaving the stage after the… pic.twitter.com/gSXTRmINMr