ఢిల్లీ AIIMS పేపర్ లీక్.. రంగంలోకి సీబీఐ
X
ఢిల్లీ ఎయిమ్స్ తాజాగా నిర్వహించిన నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ పేపర్ లీకైందని ఆరోపనలు వచ్చాయి. వాటిలో నిజాలేంటో తెలుసుకోవడం కోసం సీబీఐ రంగంలోకి దిగి.. పేపర్ లీక్ వ్యవహారంపై కేసు నమోదు చేసింది. పంజాబ్, మొహాలీకి చెందిన జియాన్ జ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీస్ కు చెందిన రితూ అనే అభ్యర్థిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
జూన్ 3న పలు హాస్పిటల్స్ లో 3055 నర్సింగ్ పోస్టుల భర్తీకి ఢిల్లీ ఎయిమ్స్ ఎగ్జామ్ నిర్వహించింది. ఈ పరీక్ష జరిగిన రోజే.. క్వశ్చన్ పేపర్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో క్వశ్చన్ పేపర్ లీక్ అయిందనే వార్త పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై విచారణ జరుపగా రితూ అనే అభ్యర్థి పేపర్ గా అధికారులు నిర్ధారించారు. దీంతో ఎగ్జామ్ సెంటర్ తో పాటు అభ్యర్థిపై కేసు నమోదు చేశారు.