ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ..
X
ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రైలు దుర్ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఓ ప్రకటన చేశారు. రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైలు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైల్వే బోర్డు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తో విచారణ చేయించాలని కోరింది.
ప్రమాదస్థలిలో సహాయక చర్యలు పూర్తైనట్లు అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, ట్రాక్ కు సంబంధించిన పనులు పూర్తికాగా.. ఓవర్ హెడ్ వైరింగ్ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. గాయపడిన ప్రయాణికులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.
#WATCH | Railway Board recommends CBI probe related to #OdishaTrainAccident, announces Railways minister Vaishnaw pic.twitter.com/X9qUs55fZr
— ANI (@ANI) June 4, 2023