ఫొటోలు పెట్టొద్దు.. రీల్స్ చేయొద్దు: కేంద్రం హెచ్చరిక
X
సోషల్ మీడియాలో ఉన్న రక్షణ సిబ్బందిని హనీ ట్రాప్ చేసి దేశ రహస్యాలు పొందే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తులు వస్తుంటాయి. ఈ విషయంపై కేంద్ర పోలీస్ బలగాలు తమ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆన్ లైన్ లో ఫ్రెండ్షిప్ జోలికి వెళ్లొద్దని, సోషల్ మీడియాలో ఫొటోలు రీల్స్ పెట్టొద్దంటూ హెచ్చరించింది. వీటి ద్వారా హానీ ట్రాప్ కు గురై.. మీ వివరాలతో పాటు, దేశ సున్నిత సమాచారం శత్రువులకు చేతిలోకి వెళ్తుందని తెలిపారు. కేంద్ర నిఘా వర్గాలు చేసిన పరిశీలనలో కొందరు వ్యక్తులు యూనిఫామ్ వేసుకుని తమ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నట్లు తెలిసింది. సీక్రెట్ లొకేషన్స్ లో దిగిన ఫొటోలను కూడా షేర్ చేస్తున్నట్లు తెలిసింది.
వీటిని ఆధారంగా తీసుకుని బలగాలను హనీ ట్రాప్ చేయడం, లేదా ఆ వివరాలతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు నేరగాళ్లు. ఇలాంటివి ఈ మధ్య పెరిగి పోతున్న కారణంగా అప్రమత్తమైన కేంద్ర భద్రత బలగాలు తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాయి. సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీపీబీ సిబ్బందికి ఈ మార్గదర్శకాల జారీ చేశారు. వాటిని ఉల్లంఘిస్తే తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించాయి.