Home > జాతీయం > కేంద్రం గుడ్ న్యూస్.. వాటిపై జీఎస్టీ భారీ తగ్గింపు.. తక్కువ ధరకే..!

కేంద్రం గుడ్ న్యూస్.. వాటిపై జీఎస్టీ భారీ తగ్గింపు.. తక్కువ ధరకే..!

కేంద్రం గుడ్ న్యూస్.. వాటిపై జీఎస్టీ భారీ తగ్గింపు.. తక్కువ ధరకే..!
X

ప్రతీ వస్తువుపై అధిక ధరలు మండిపోతున్న వేళ.. సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎలక్ట్రానిక్ వస్తువులపై జీఎస్టీని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దాంతో మొబైల్ ఫోన్స్, టీవీ, రిఫ్రిజిరేటర్, ఫ్యాన్స్, వాషింగ్ మెషిన్.. సహా అనేక గృహోపకరణాల ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ గూడ్స్ పై 31.1 శాతం జీఎస్టీ ఉండగా.. దాన్ని 18 శాతానికి తగ్గించింది. ఏయే వస్తువుపై ఎంత ధర తగ్గుతుందనే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. 27 అంగుళాలకన్నా ఎక్కువున్న టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్, మిక్సర్, జ్యూజర్, వాక్యూమ్ క్లీనర్, గీజర్, ఫ్యాన్, కూలర్, ఎల్పీజీ స్టవ్, ఎల్ఈడీ బల్బులు, కుట్టు మెషిన్లు, యూపీఎస్ లు, కిరీసిన్ ల్యాంథర్లు, వ్యాక్యూమ్ ఫ్లాస్క్, వ్యాక్యూమ్ వెస్సల్స్, మొబైల్ ఫోన్స్ పై జీఎస్టీ తగ్గుతుంది. వీటిపై ఎంత జీఎస్టీ తగ్గనుందంటే...





ఈ ఏడాది కేంద్రం జీఎస్టీ ద్వారా వసూలు చేసింది రూ. 1,57,090 కోట్లు. ఇది పోయిన ఏడాదితో పోల్చితే 12శాతం ఎక్కువ. ఒక్క మే నెలలోనే మే నెలలో సీజీఎస్టీకి రూ.28,411 కోట్లు, ఎస్‌జీఎస్టీకి రూ.35,828 కోట్లు, ఐజీఎస్టీకి రూ.81,363 కోట్లు వసూలయ్యాయి. రాష్ట్రాల వారిగా పరిశీలిస్తే.. మహారాష్ట్రలో అత్యధికంగా రూ. 23,536 కోట్ల జీఎస్టీ వసూలు అయింది. కర్నాటక, గుజరాత్, తమిళనాడు, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి.




Updated : 1 July 2023 6:59 PM IST
Tags:    
Next Story
Share it
Top