కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. బియ్యం ధరలు...
X
దేశంలో ప్రస్తుతం నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ప్రజల పరిస్థితి ఏం కొనేటట్టు లేదు..తినేటట్టు లేదు అన్నట్లు ఉంది. టమాట సెంచరీ క్రాస్ చేయడమే కాకుండా డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకుంది. పచ్చిమిర్చి సైతం తినకుండానే మంట పెట్టిస్తోంది. ఇంకొన్ని కూరగాయల ధరలు రీటైల్ మార్కెట్‌లో రూ.100 దాటేస్తున్నాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే బియ్యం ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. భవిష్యత్తులో కూడా బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై నిషేధాన్ని విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర దేశాలకు వారి ఆహార భద్రత అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం మంజూరు చేసిన అనుమతి ఆధారంగా, వారి ప్రభుత్వాల అభ్యర్థన ఆధారంగా ఎగుమతి అనుమతించబడుతుందని ఉత్తర్వులు జారీ చేసింది. సెమీ మిల్లింగ్ లేదా పూర్తిగా మిల్లింగ్ చేసిన బియ్యం, పాలిష్ చేసినా లేదా గ్లేజ్ చేయని బియ్యానికి ఇది వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో భారతదేశంలో బియ్యం ధరలు తగ్గే అవకాశం ఉంది.