Home > జాతీయం > జీఎస్టీపై కేంద్రం సంచలన నిర్ణయం..మనీలాండరింగ్‌ చట్టం పరిధిలోకి..

జీఎస్టీపై కేంద్రం సంచలన నిర్ణయం..మనీలాండరింగ్‌ చట్టం పరిధిలోకి..

జీఎస్టీపై కేంద్రం సంచలన నిర్ణయం..మనీలాండరింగ్‌ చట్టం పరిధిలోకి..
X

పన్నుల నుంచి వచ్చే ఆదాయాన్ని వీలైనంత పెంచుకోవడంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. దేశంలోని చిన్న ఆదాయ వర్గాలను సైతం టాక్స్ కిందకు తేవడంతో పాటు పన్ను అక్రమాలను నిరోధించే ప్రణాళికలను రచిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ పరిధిలోకి గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ నెట్‌వర్క్‌ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

జీఎస్టీలో జరుగుతున్న అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. కేంద్ర నిర్ణయంతో జీఎస్టీ సంబంధిత విషయాల్లో ఈడీ నేరుగా జోక్యం చేసుకోవచ్చు. పన్ను ఎగవేత, డాక్యుమెంట్లలో తారుమారు చేసిన వారిపై ఈడీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. జీఎస్టీ చెల్లింపు దారులు అనుమానాస్పదంగా ఫారెక్స్‌ ట్రాన్సాక్షన్‌ జరిపారని నిర్ధారిస్తే ఈడీ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అధికారులు సంబంధిత సమాచారాన్ని జీఎస్‌టీఎన్‌కు చేరవేస్తారు.

తాజా నిర్ణయంతో జీఎస్టీ చెల్లింపుల్లోని అక్రమాలు, ఇతర అనుమానాస్పద ఆర్ధిక లావాదేవీల్ని అరికట్టవచ్చని కేంద్రం తెలిపింది. నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లు, నకిలీ ఇన్‌వాయిస్‌లు వంటి జీఎస్టీ మోసాలు మనీలాండరింగ్ నిరోధక చట్టం కిందకు వస్తాయి. మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు తేలితే ఆ వ్యక్తికి కనిష్టంగా 3 ఏళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించవచ్చునని చట్టం చెబుతోంది.

Updated : 9 July 2023 3:24 PM IST
Tags:    
Next Story
Share it
Top