Home > జాతీయం > సముద్రంలో ఎక్కడ దాక్కున్నా వాళ్లను వెంటాడతాం: రక్షణ మంత్రి

సముద్రంలో ఎక్కడ దాక్కున్నా వాళ్లను వెంటాడతాం: రక్షణ మంత్రి

సముద్రంలో ఎక్కడ దాక్కున్నా వాళ్లను వెంటాడతాం: రక్షణ మంత్రి
X

భారత్ కు వస్తున్న వాణిజ్య నౌకలపై ఇటీవల వరుస దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణంలోకి తీసుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. భారత పరిజ్ఞానంతో తయారుచేసిన యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ ఇంఫాల్’ను నౌకాదళంలో ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్.. నిందుతులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనలపై చర్యలు తీసుకునేందుకు సముద్ర జలాల్లో గస్తీని ముమ్మరం చేసినట్లు తెలిపారు. వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడినవారు సముద్రంలో ఎక్కడ దాక్కున్నా వారిని వేటాడి పట్టుకుంటామని హెచ్చరించారు.

అరేబియా సముద్రంలో గుజరాత్ తీరానికి సమీపాన ప్రయాణిస్తున్న ఎంవీ కెమ్ ప్లూటో అనే వాణిజ్య నౌకపై డిసెంబర్ 23న డ్రోన్ తో దాడి జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన భారత నౌకాదళం.. ఐసీజీఎస్ విక్రమ్ సాయంతో.. ఆ నౌకను ముంబై పోర్ట్ కు తీసుకొచ్చింది. కాగా ఈ డ్రోన్ దాడి ఇరాన్ భూభాగం నుంచి జరిగిందని.. అమెరికా రక్షణశాఖకు చెందిన పెంటగాన్ తెలిపింది. అయితే అమెరికా ఆరోపణను ఇరాన్ ఖండించింది.


Updated : 26 Dec 2023 5:13 PM IST
Tags:    
Next Story
Share it
Top