Home > జాతీయం > కేంద్రం గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వడ్డీ రేటు పెంపు

కేంద్రం గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వడ్డీ రేటు పెంపు

కేంద్రం గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వడ్డీ రేటు పెంపు
X

ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈపీఎఫ్ (ఎంప్లాయిస్ ప్రొవిడియెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) వడ్డీ రేటును పెంచింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ.. 8.15 శాతం వడ్డీ రేటును పెంచింది. దీనిపై సీబీటీ (సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ) తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించింది. దాంతో ఈపీఎఫ్ఓ సోమవారం ఈ విషయంపై అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గత ఆర్థిక సంవత్సరం వడ్డీ రేటు 8.10శాతం ఉండగా.. ప్రస్తుతం 8.15శాతం ఇవ్వాలని ఆమోదించారు.

ఈపీఎఫ్ పై వడ్డీ రేటు పెంచాలని సీబీటీ ఈ ఏడాది మార్చిలోనే నిర్ణయించింది. దీనిపై సమగ్ర నివేదిక తీసుకున్న కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం ఆమోదించింది. ఈ నిర్ణయం వల్ల దేశ వ్యాప్తంగా 6 కోట్ల మంది చందాదారులు లాభపడుతారు. 1977-78 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ వడ్డీ రేటు 8శాతం ఉండేది. తర్వాత దాన్ని పెంచుతూ 2015-16 సంవత్సరంలో 8.8 శాతం చేశారు. తర్వాత నాలుగు దశాబ్దాల కనిష్ఠ స్థాయి వడ్డీ రేటును 2021-22 ఆర్థిక సంవత్సరానికి 8.1కు తగ్గించారు. తాజాగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును స్వల్పంగా పెంచారు.

Updated : 24 July 2023 4:31 PM IST
Tags:    
Next Story
Share it
Top