MSP Hike: రైతులకు శుభవార్త.. అన్ని పంటలకు గిట్టుబాటు ధర పెంపు
X
కేంద్ర ప్రభుత్వం దీపావళికి ముందే రైతుల జీవితాల్లో వెలుగు నింపే నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన కేంద్ర కేబీనెట్ మీటింగ్ లో పలు కీలక హామీల అమలుపై చర్చించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 4 శాతం డీఏను పెంచింది. . ప్రస్తుతం డీఏ 42శాతంగా ఉండగా.. తాజా పెంపుతో అది 46శాతానికి పెరిగింది. డీఏను 4శాతం పెంచింది. పెరిగిన డీఏ జూలై 1, 2023 నుంచి అమలులోకి రానుంది. దీంతో 48లక్షల ఉద్యోగులతో పాటే పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. దీంతో పాటు రైల్వే ఉద్యోగులకు రూ. 1968.87 కోట్ల ఉత్పాదకత లింక్డ్ బోనస్, పెన్షనర్లకు 4 శాతం డియర్నెస్ రిలీఫ్ ప్రకటించింది.
జూలై 1 నుంచి వర్తిస్తుందని తెలిపింది.అంతేకాకుండా తాజా నిర్ణయంలో.. 6 రబీ పంటలకు మద్దతు ధర పెంచున్నట్లు ప్రకటించింది. పంటలపై ఎంఎస్‌పీని 2-7 శాతానికి పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రబీ పంటలైన గోధుమ, బంగాళదుంప, శనగ, కాయ ధాన్యాలు, లిన్సీడ్, బఠానీ, ఆవాలు సాగు చేసే రైతులకు లబ్ధి చేకూరనుంది. క్వింటా కందులపై రూ.425 మద్దతు ధర పెంచారు. గోధుమపై 2 వేల 275, బార్లీపై రూ.1850 మద్దతు ధరను పెంచారు. వీటితో పాటు దేశంలోని యువత అభివృద్ధి కోసం.. మై భారత్ పేరుతో ఇన్ స్టిట్యూట్ ను ఏర్పాటుకు ఆమోదం లభించింది.
#WATCH | The Union Cabinet has approved hike in Minimum Support Prices (MSP) for Rabi Crops for 2024-25, says Union Minister Anurag Thakur in Delhi. pic.twitter.com/x9W8uPEcEU
— ANI (@ANI) October 18, 2023